మనో చిత్రం

మార్చి 9, 2006 at 4:31 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | Leave a Comment

hj.gif

నిన్న రాత్రి నిద్రలో
రాలిన స్వప్న సుమాలన్నీ
చీకటికి అవతల చిలిపి
మాలల్ని కట్టినప్పుడు
గోధూళి సంజెలన్నీ
గోరువంకలై గుండె గూటికి
చేరుకున్నప్పుడు
విరజాజులన్నీ విరహ
విహ్వలలై మంచు ముద్దుల
మధ్య మౌనికలైనప్పుడు
మార్గ శిర సుమాల్లో ముగ్ధవై
శరత్సౌధాల సందిట సుకుమార స్వప్న శిల్పానివై
భావ చిత్రమా! హరివిల్లుకి
ఎన్ని రంగుల్ని అద్దావు
మౌన రాగమా! ప్రతీ పాట లో ఎంత
రమ్యత ని రంగరించావు.

-స్వాతి

No Comments Yet »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.