ఒక వాక్యం లో ఒక పదం యొక్క ప్రాముఖ్యత గురించి నాకో విషయం గుర్తొస్తుంది.
I hit him on his eye అనేది వాక్యం.
దీనిలో only అనే పదం అది ఉన్న స్థానాన్ని బట్టి అర్ధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.
ONLY i hit him on his eye
నేనొక్కడ్నే అతని కంటి మీద కొట్టాను(ఆ ఘన కార్యం ఎవరి సహాయం లేకుండా చేసాను)
i ONLY hit him on his eye
నేనే అతని కంటి మీద కొట్టాను( అవును నేనే, ఇంకెవరో కదు, ఏం చేస్తావ్?)
i hit ONLY him on his eye
నేను అతన్నొక్కడ్నే కంటి మీద కొట్టాను(మిగాతా వాళ్ళని వేరే చోట్ల కొట్టాడు కాబోలు)
i hit him ONLY on his eye
నేనతన్ని కేవలం కంటి మీదే కొట్టాను (అక్కడికి నయమే సంతోషించమను వాడ్ని)
i hit him on ONLY his eye
అతన్ని అతని కంటి మీదే కొట్టాను (ఇది మరీ చోద్యం, ఎవడిని వాడి సొంత కంటి మీదే కదా కొట్టాలి)
i hit him on his ONLY eye
అతన్ని అతని ఒకే ఒక కన్ను మీద కొట్టాను(అతనికి ఒక్కటే ఉంది మరి)
మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి మాటల గురించి నేను చదివిన ఒక కొటేషన్ :”words are like leaves. Where they are most abound, much fruit of sense beneath is rarely found.”
ఒక్కో పదానికున్న విశిష్టత, జనాలు అదేమీ పట్టించుకోకుండా మాటలను నిర్లక్షంగా, అలవోకగా వాడే తీరు గురించి కొడవటిగంటి కుటుంబ రావు గారు ‘మాటల అడివి’ అనే అద్భుతమైన గల్పిక వ్రాశారు. మీరది చదివారా?
చదవలేదు 3v గారు,
ఇలా మన వాళ్ళు చెప్పారని నిన్ననే “అమరావతి కధలు” కొన్నాను. బాగున్నాయి..
మీరు చెప్పినవి కూడా చదువుతాను.
అప్పుడెప్పుడో “చలపతి కధలు” అని చెప్పారు.
దాని రచయిత పేరు కూడా చెప్పండి.
ఈసారి book shop కి వెళ్ళినప్పుడు వెతుకుతాను.
chaalaa baavundi kalhara gaaruu
chakradhar
http://www.chakradhar.net