ఒక వసంతం

మే 5, 2006 at 4:46 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 1 Comment

కొసరి కొసరి గ్రోలకే గండు తుమ్మెదాbut.jpg
ముసిరి ముసిరి తేనెలతో కన్నె పూ యద

పసి కుసుమం పిలుపు కోసం మధుమాసం ఎదురు చూసి
మరుమల్లెల సొగసులోన మారాకులు మురిసి పూసినప్పుడు

మిడిసి మిడిసి కురియకే వెండి వెన్నెలా
తడిసి తడిసి మూసుకున్న కలువ కన్నులా

వాలిపోవు సంజెలపై కెంజాయల రంగు ఒలికి
రేయి తిరిగి చీకటి తో చేయి కలుపుతున్నపుడు
పిలిచి పిలిచి పాడకుమా గడుసు కోయిలా
తలచి తలచి వేచి ఉన్న మావి కొమ్మలా

రాలిపోవు ఆకులేరి రాదారుల తీరు మారి
చలిగాలులు శిశిరానికి సెలవు పలుకుతున్నప్పుడు

-స్వాతి

1 వ్యాఖ్య »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. ఇలాగే మీ కవితా పరంపర అనునిత్యం సాగిపోవాలని ఆకాంక్షిస్తూ…మీ అభిమాని


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.