మరోసారి

మే 8, 2006 at 11:49 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 2 Comments

 cplenew2.jpg

ఈ మాఘ మాసపు మొదటి ప్రణయోదయాన,

సుమలతలన్నీ హేమలతలై
అరుణ వర్ణం స్వర్ణార్ణవమై..

ఆహ్వనించగానే.

నిన్నటి నీరెండ నీడల్లో
నళినీ దళాలపై నవ్వుల బారుల్లా సాగిన

మన సాయంకాలపు సాన్నిహిత్యాన్ని సైతం మరచి
మరోసారి కొత్తగా పరిచయమవుదామా…

-స్వాతి
ప్రేరణ : Gumrah అనే పాత హిందీ సినిమా పాట

“Chalo ek bar phir se

ajnabi ban jaye hum dono..”

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. నాకు హిందీ రాదు. కానీ మీ తెలుగు కవిత నాకు చాలా బాగా నచ్చింది. మంచు తెరలు విచ్చుకునే మాఘ మాసం లో, బంగార్రంగులోకి మారిన పండుటాకులు పుడమితల్లిని దుప్పటిలా కప్పి వేసే మాఘమాసంలో సాక్షాత్కరించేది స్వర్ణార్ణవమే కద?

    “నిన్నటి నీరెండ నీడల్లో నళినీ దళాలపై …”
    చక్కటి భావన.

  2. మిమ్మల్ని పుస్తకపురుగు కుట్టినది, నివారణ మరియు ఇతర వివరాలకు పుస్తకాల పురుగు కుట్టింది చూడండి.

  3. “మరోసారి కొత్తగా పరిచయమవుదామా…”
    పరిచయమయ్యాక మామూలయ్యే స్నేహం కంటే విరిసీ విరియని తొలి ప్రేమలో మాధుర్యమే మాధుర్యం. — ప్రసాద్


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.