
ప్రతి ఉషోదయానా ఇలాగే
మెలకువలు పలకరిస్తున్నాయి
బాల భానుడి భావ గీతాల పలకరింత తో..
ప్రతీ కులాయం లోను కువకువలు కలవరిస్తున్నాయి.
ప్రతి అరుణోదయానా ఇలాగే
మయూఖ రేఖలు పరచుకుంటున్నాయి
మసక తెరల చాటున నీహారిక కరిగి పోగానే
తుషార స్వప్నాలు నునుసిగ్గుతో తరలిపోతున్నాయి..
ప్రతి శుభోదయానా ఇలాగే
నా లోగిలి లో తన్మయత్వాలు గవాక్షాలు దాటి ఎగిరిపోతున్నాయి.
-స్వాతి
vah vah…