
ఒక చిరు చినుకు రాలినప్పుడు
నా పసి మనసు పరుగులు తీస్తుంది.
మెరుపు మెరవగానే
ఉలికిపాటుతో ఉద్విగ్నపడుతుంది
కిటికీ తెరిచానో లేదో
మనసు కూడా తడిసి ముద్దబంతవుతుంది.
చూరు కింద మా తెల్ల కోడి
రెక్కల కింద పిల్లల్ని ప్రేమ తో తడిపేస్తుంది.
నేను నాటిన విత్తనం
ఆరుబయట మొలవటానికి ఆరాటపడుతుంది.
వాన వెలుస్తుండగానే
నా స్మృతుల రంగులన్నీ హరివిల్లుగా మారిపోతాయి.
-స్వాతి
chala bagundi…
మీ (హ)వర్షోల్లాసంలో నేనూ తడిసిపోయాను.
naa kallallo nijangaane kanneti varsham kuripinchaaru…chooru kinda thella kodi & pillalanu choopi…Thanks!!!
chaaaala bagundi swathi
chaaaala bagundi. Varsham kurisinappudu kalige feeling chala baaguntundi nee kavithalage.
మీ కవితలన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రతి కవితకూ మీరు ఎన్నుకున్న చిత్రం చాలా బాగుంది. చిత్రానికి కవిత, కవితకు చిత్రం వన్నె తెస్తున్నాయి. ఇంత మంచి చిత్రాలు మీకెక్కడ దొరుకుతున్నాయి? కొంపదీసి మీరు చిత్రకారులు కూడానా?
– ప్రసాద్
ఏదో బొమ్మలు కూడా వేస్తాను కానీండి.. ఇవి నేను వేసినవి కాదు.. మీరన్నాక అనిపిస్తుంది నేను వేసినవి కూడా పెట్టి చూద్దాం అని.