ఆనవాలు

మే 30, 2006 at 11:38 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 3 Comments

pongal22.JPG

ఎంతగా అనుకున్నా నన్నెందుకు మర్చిపోలేవంటే..

గుప్పెడు సన్నజాజులు గుండె నిండా గుభాళించినప్పుడో
తెలుగింటి తులసి కోట పక్కన కార్తీకపు చలి దీపాలు వెలిగినప్పుడో
ధనుర్మాసపు వాకిళ్ళలో గొబ్బి పువ్వులు విచ్చుకున్నప్పుడో
రంగవల్లిక దిద్దే లేత అరచేతులు గోరింట పంట పండించినప్పుడో
ఒక ఉగాది కోయిల కూజితం తో పాటు
ఒక త్యాగరాయ కృతి తో పాటు
అట్లతద్ది ఉయ్యాలలూగుతూ
నా జ్ఞాపకం నీ మనసులోకి చొరబడుతుంది.

-స్వాతి

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. chala chala Bagundi…

  2. అట్లతద్ది ఇప్పుడు ఎంత మందికి తెలుసంటారు!!! ఇలాంటి చక్కటి విషయాల తో సాహిత్య సేవ చేస్తున్న మీరు సర్వదా అభినందనీయులు…కళ్ళ కెదురుగా జరిగినట్లు,సన్నజాజుల వాసన తెలిసినట్లు,కోయిల కూజితం విన్నట్లు ఉంది.

  3. chaala chakkani padAlatO chAlA baagA rAsAvu


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.