రహస్యం

జూన్ 23, 2006 at 10:08 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 10 Comments

waterhouse18.jpg
అలవాటు పడిన అడుగుల సడి దగ్గరవగానే వూపిరి బరువెక్కి ఆశ నిరాశలు ఆత్రపడి
కలిసి ఉన్న కాసేపూ మాటలు కలత పడి
ఉద్వేగపు బరువు మోయలేక గోడకు చేరగిలబడి
నువ్వెళ్ళినవైపే చూపుల చినుకులు పడి
తల వంచుకున్నా, కళ్ళు దించుకున్నా పెదవులు చిరునవ్వు వలలో పడి
ఇంతకు మించి చెప్పలేక నేను అయోమయ పడి
నువ్వే అర్ధం చేసుకుంటావని ఆశ పడి.

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. మళ్ళీ మళ్ళీ చదివాను ఆనందపడి
    ఈ బొమ్మ ఎలా సంపాదించారని ఆశ్చర్యపడి
    మరిన్ని కవితలు చదవాలని ఆశపడి
    ఎన్నోసార్లు వస్తాను మీ బ్లాగు కి త్వరపడి
    మీ కవిత లేకుంటే నిట్టూరుస్తాను బాధపడి
    – ప్రసాద్

  2. “నువ్వెళ్ళినవైపే చూపుల చినుకులు పడి” — చాలా బాగుంది.
    – ప్రసాద్

  3. ప్రసాద్ గారు, ప్రాస తో భలే చక్కగా చెప్పారే!!!

  4. chAlA bAgundi padAla pondika…

    randhrAnveshana anukokapothe naavi rendu mukkalu…
    “maaTalu kalatapaDi” anaDam lo mee bhaavam?…did u use it in the meaning of “taDabaDi”?

    “ఇంతకు మించి చెప్పలేక నేను అయోమయ పడి”
    vellipOyaka inka yEmi cheppagalaru…ilaa unTE inkaa baagundunemo anipinchindi….

    తల వంచుకున్నా, కళ్ళు దించుకున్నా పెదవులు చిరునవ్వు వలలో పడి
    ఇంతకు మించి చెప్పలేక నేను అయోమయ పడి
    నువ్వెళ్ళినవైపే చూపుల చినుకులు పడి
    నువ్వే అర్ధం చేసుకుంటావని ఆశ పడి.

  5. ఈ దశ లో మాటల నిండా ఒక బరువు ఉంటుంది. ఒక మధన.. దాన్నే కలత అన్నాను..

    ఇదంతా మనిషి ఉంటే చెప్పడం కాదు మనసులో చెప్పుకోవడం..
    ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పాక ఇంత కన్నా ఇంకేమి తోచక అలా అనటం అన్నమాట.

    ప్రేమ లో నవ్వు దూరం గా ఉన్నప్పుడు వచ్చే జ్ఞాపకాల వల్ల కలుగుతుంది అందుకే చివర్లో నవ్వు గురించి.

    ఏమో నాకు తెలిసింది తెలిసినట్టు రాశాను..
    ఈ విషయం లో మాత్రం లాజిక్ కన్నా అనుభవాన్ని ఎక్కువ నమ్ముతాను.

  6. చాలా బాగుంది..

  7. ఇందులో తెలియడానికి ఏముందండీ…ఎవరి భావన వారిది…వాదన కోసమో, తప్పులు పట్టడం కోసమో కాదండీ…మీ భావాన్ని అర్ధ్హం చేసుకునే ప్రయత్నం మాత్రమే…తప్పుగా అనిపిస్తే క్షమించండి…

  8. No, i was just explaining my view to clarify you. Ther’s nth like arguement.
    Thanks for expressing your opinions analytically.
    Comments like urs are always valuable.:)

  9. chaalaa chaalaa nachindandi.mee pada prayogam chaala baagundi.mee kavita cadivaakaa alanti aalocanale chaalaa vachayi.na site lo raste..copy anukuntaremo?

  10. వ్రాస్తున్నా ఇది నే ఇష్టపడి.


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.