
ఆలయ మంటపం లో పగటి పని తో అలసిన నేను
ఆ పక్కనే ఆలస్యానికి అలిగిన కోనేరు
సాయంత్రపు గాలులతో సేద తీరాక
గల గల లు గుస గుసలు పంచుకున్నాక
నా దారిని కదిలి వెళ్ళబోతుండగా
గోధూళి కుంకుమ తో ఆహ్వానించబోయిన అవని
తలెత్తి చూడగానే
కెంజాయల్లోనో
నీలిమల్లోనో
క్రిష్ణ వర్ణాల్లోనో
అప్పటికే అలంకరించుకుని
పున్నాగ పూతల అత్తరు చల్లుతూ
చీర చెరగుతో చలి ని కదిలిస్తూ
నా దారి పొడవునా తోడుగా
మసక చీకటి చాటున సంధ్యా సుందరి.
భలే వర్ణించారు సాయంసమయాన్ని. అది మరింత వర్ణభరితంగా వుందిప్పుడు.
– ప్రసాద్
http://charasala.wordpress.com
బాగుంది
మసక చీకటి చాటున సంధ్యా సుందరిని చూపించారు…
manchi oooha….
chala baaga vrasaru….,
chala baagundandi mee sandya sundari.
adbhutamaina varnana.chitram kuda bahu cakkaga vunnadi.
“చీర చెరగుతో చలి ని కదిలిస్తూ..”
ఇది చాలా అందంగా ఉంది.
ఎంత బాగుందంటే, ఎప్పుడో దీన్ని దొంగతనం చేసేయాలనుంది