
ప్రభాతపు పొత్తిళ్ళల్లో
పెరటిలో గులాబి మొక్క
మొదటి సారిగా ప్రభవించిన
ఆ మొగ్గ మేనిలో అవి
చిరుగాలి చిదిమి పొయే
లేత సౌకుమార్యములో
కెంపులైనా చిన్నబోవు
ముగ్ద సౌందర్యములో
ఆ కలిక పైన అవి
కలికి కన్నుల్లో కలలు రేపు
ఆముక్త మౌక్తికములో
మయూఖ రేఖల్లో కరిగిపోవు
తుషార బిందు సందోహములో
ఆ ముకుళము వాలిన పల్లవముల పై అవి
ఊయలలెరుగని వేల సుగంధములో
రాచిలకల లోని వర్ణ సమ్మేళనములో..
excellent
sirivennela gari saili koddiga kanipistundi .chala baagundi.
tusaaram ante telusu,,mari tusara bindu sandoham ante yemtandi