ఇలా జరుగుతుందని విన్నప్పుడు నేను నమ్మలేదు.
కానీ కొన్ని అనుభూతులు అనుభవైకవేద్యాలే కదా!
అసలింతకీ ఏం జరిగిందంటే మా పెళ్ళయ్యి దాదాపు ఏడాది కావొస్తుండగా అంటే మొదటి పెళ్ళి రోజుకు ముందే అతను నా జీవితం లోకి వచ్చాడు.
రోజు రోజు కీ సాంద్రత పెరిగే భావం.. అది ప్రేమే ఐతే.. అవును తప్పుకోలేని, చూపు తిప్పుకోలేని ప్రేమలో పడిపోయా. అంత అందమైన కళ్ళు, విల్లు లాంటి పెదవులు,ఆకట్టుకొనే నవ్వులు.
అనుబంధానికి కాలం కూడా ఒక కొలమానమైతే రెండు నెలల్లోనే ఇంత దగ్గరితనం ఆశ్చర్యమే!
అవును మరి “ప్రహసిత్” అని నేను పేరు పెట్టిన వాడు నాకు పుట్టి ఇప్పటికి రెండు నెలలే.
* బుజ్జిగాడికి అమ్మనైన ఆనందం లో
ఎన్నాళ్లకు మళ్లీ ఇలా! మొదట మీకు,మీ శ్రీవారికి నా అభినందనలు తల్లిదండ్రులైనందుకు…’ప్రహసిత్’ చక్కటి పేరు. వీలైతే మీ బుజ్జిగాడి ఫోటో ఒకటి పంపండి. మళ్లీ మీ కవితా ప్రవాహానికి ఆహ్వానం! ప్రహసిత్ కు ముద్దులు!
మీకు పుత్రుడు పుట్టినందుకు శుభాకాంక్షలు.
ఇక మీకు రోజూ ప్రతి రోజు పండగే పండగ.
ఆనందాలకు హద్దుండదిక.
వీలయితే మీ అబ్బాయి పేరు మీద ఒక బ్లాగ్ ఓపన్ చేసి అందులో మీ అబ్బాయి రోజూ వారి కార్యక్రమాలు నింపెయ్యండి. మీ బ్లాగు పబ్లిక్ కాకుండా ప్రైవేటు గా వుంచుకొవచ్చనుకుంటా.
విహారి
శుభాకాంక్షలు
-అనిల్ చీమలమఱ్ఱి
అదన్నమాట సంగతి.
మీకు శుభాకాంక్షలు. ఇక చూడండి రోజులెలా దొర్లిపోతాయో మీకు తెలియకుండా!
ఈ మద్య మీరు కనపడకపోవాడానికి కారణమేంటబ్బా అనుకున్నా! ప్రహసిత్ ప్రభావమన్నమాట!
–ప్రసాద్
http://blog.charasala.com
matrutwaanni tanivitiiraa aaswaadimcamdi.punahswaagatam.
hearty congratulations! and all the best…. God bless!
మీకు నా శుభాకాంక్షలు అండి.
మీకు నా శుభాకాంక్షలు, మరియు చిన్నారి ప్రహసిత్ కు నా ఆశీర్వాదాలు. ప్రహసిత్ అంటే అదేదో నవలలో (మధుబాబుదో లేక చల్లా సుబ్రమణ్యందో) కథానాయకుడి పేరు కదా?
మంచిది.
ప్రహసితుడంటే ఎవరు? ఆ పదానికి అర్ధం ఏమిటి?
ప్రహసనం అంటే నాకు తెలుసు. ప్రహసిత్ అంటే మీరు చెప్పాలి.
Congratulations Swathi garu. Charasala gari blog chaduvutunte mee comments kanipinchi..alaa alaa mee blog loki vacchesaanu, seems i have found a nice blog.
maternity leave tarvata meeru raase modati blaag kachitamgaa mee baabu gurinche untundi ani oohinchinatte jarigindi. ammatanam alaantidi mari!
ఎన్నాళ్లకు ఎన్నాళ్ళకు…
మీ ఆనందమయ జీవితం ఇలాగే కలకాలం సాగాలని కోరుతున్నా…హార్దిక శుభాకాంక్షలు. ప్రహసిత్ కు ఆశీర్వాదాలు