అంతర్వాహిని

జనవరి 29, 2007 at 5:45 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 12 Comments

        lady-body-scrub.jpg

కోడి కూత కి వేకువ కి నడుమ కల నుండి మెలకువగా మారిన నీ జ్ఞాపకం
నీహారిక నెమ్మదించేవరకు ఆహ్లాదంగా కదిలి
జడ వేసుకుంటూ, మెట్లు దిగుతూ, రోడ్డు మీద నడుస్తూ ఉండగా హడావిడిగా పరుగిడి
అపరాహ్ణాన ఇత్తడి చెంబు నీట మునగ్గానే వేప చెట్టు పైన వడ్రంగి పిట్ట చప్పుడు ఆగినప్పుడు అలసటగా ఒదిగి
సాయం సమీరాల్లో వాలు కుర్ఛీ లో ప్రతి పేజీ కి పాట కి మధ్య విరామం గా
నడిరేయి కనుల క్షేత్రం లో నిద్ర కి నీటి కి జరిగే యుద్ధం లో మరిన్ని గాయాలు మిగిల్చి…
చీకట్లో తోడు గా ఉండే నీ జ్ఞాపకం.

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. కొద్ది గా మాత్రమే అర్దమయిన భావం… కానీ గొప్ప కవిత చదివిన అనుభూతి…ఏమిటి మీ కవితలో ఈ మహత్యం.

  2. పూర్తిగా అర్థం కాలేదు.
    తెల్లవారుఝామున వచ్చే కలల గురించా?
    –ప్రసాద్
    http://blog.charasala.com

  3. ఉనికి లో ఉన్న జ్ఞాపకం కలలోకి వచ్చిందా లేక అప్పుడే కలలో పుట్టిందా!
    లేదు మొదటిదే అయి ఉంటుంది.
    ‘కనుల క్షేత్రం లో నిద్ర కి నీటి కి జరిగే యుద్ధం లో’
    చాలా అద్భుతంగా రాశారు.

  4. chakka gaa vundi

    విహారి
    http://vihaari.blogspot.com

  5. ఇది నేను కొంఛం అబ్సర్డ్ గా రాసినట్టున్నాను. ఏదేమైనా మీకు అర్ధమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

    ఒక ప్రేమలోనో, విరహం లోనో, దాని వల్ల కలిగిన విషాదం లోనో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా అవే తలపులు మనసులో ఎదో ఒక మూలన కదలాడుతూనే ఉంటాయి.
    రాత్రి నిద్ర లో కలాలా వచ్చి ఉదయం అదే కలని అలోచన గా కొనసాగిస్తూ మేల్కొంటాం.
    ఉదయం దాదాపు అలోచనలు ఆహ్లాదం గానే ఉంటాయి.
    తర్వాత పనిలో పడినప్పుడు అంత హడావిడి లోనూ అప్పుడప్పుడు తలపులు కలుగుతూ ఉండటం..
    అలసట గా ఉన్నప్పుడు ఆ విషాదం తాలుకు బాధ కొద్దిగా ఆ అలసట కి తోడవుతుంది.
    ఛదువుకుంటున్నా, పాటలు వింటున్నా వదలవు..
    ఇక చివరికి శారిరకమైనా, మానసికమైనా ఏ బాధైనా రాత్రి పూటే ఉధృతం గా ఉంటుంది.
    నిద్ర పోబోయే ముందో, నిద్ర మధ్యలో మెలకువ వచ్చో, ఆ సమయం లో ఉండే నిశ్శబ్ధం వల్ల పూర్తి ఏకాంతం చిక్కటం వల్లా ఒక nostalgic feeling వల్ల విపరీతమైన కన్నీళ్ళు వస్తూ ఉంటాయి.

  6. బావుంది! మీరు చాలా బాగా వ్రాస్తారు!

  7. మీ వివరణ తో మళ్ళీ చదివితే మీ కవిత మరింత అందంగా శోభిళ్ళింది.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  8. మీరు కవిత రాయడం ఏమిటో గానీ నిన్నటి నుండి మీ కవితలో చెప్పినట్టు గా నాకు జరుగుతుంది.అలా వెంటాడేది జ్ఞాపకం కాదు….మీ ఈ కవితే

  9. చాల చక్కటి అనుభూతి కవిత.ఈ కవితని నేను రాస్తున్న వాస్యంలో ఉదాహరించి, వివరించొచ్చా? అలాగే కొన్ని మార్పులు సూచించవచ్చా?
    – నాగరాజు.

  10. Beautiful.
    కనుల క్షేత్రంలో నిద్రకీ నీటికీ మధ్య యుద్ధం ..
    fantastic!!!

  11. 6.5/10

  12. liked it


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.