మురళీ రవళి

జనవరి 31, 2007 at 6:44 పూర్వాహ్నం | In ‌పోస్ట్ బాక్స్ | 7 Comments

        krishna.jpg

మధువులొలకవేమిరా మధుసూధనా
మధురాపురి ముదమందగ యదునందనా

యమున యదలో ఎప్పుడో జలపాతమై
కరిగి వీనుల విందులో నవనీతమై

వెదురు గుండెకు గానమూదిన పవనమేమో మోహనం
రాగ సుధాలాపనలో ప్రతి పయనం సమ్మోహనం                                     

సందెల సందిట అందమే బృందావనిగా
నీ అందెల అలికిడికే పులకించిన అవనిగా

ఆ భావమే భూపాలమై లేచె మధురిమలే
నిశి మలుపులో ఆ పిలుపుకై వేచే అరుణిమలే

మధువులొలకవేమిరా మధుసూధనా

- స్వాతి

* “రేపల్లియ యదఝల్లున” స్పూర్తితో  కొన్నేళ్ళ కిందట రాసుకున్నది.
దీన్ని ఎవరైనా ట్యూన్ చేస్తే వినాలని ఉంది.

అభిప్రాయములు »

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

  1. aaaha…
    deenini chakkati raagamaalikagaa tune cheyyachchu…i will suggest madhuvanthi, yamuna kalyani, brindavana saranga, mohana and bhupalam… :)

  2. ఈ కవితలో పదాల అల్లిక చాలా బాగుంది.పాటకి సరిగ్గా సరిపోతుంది

  3. తొలిసంధ్యవేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగంకదూ భూపాలం!
    మధురిమల నిదురలేపేందుకు ఆ భావం భూపాలరాగమయిందనడం – నాకు చాలా నచ్చింది.
    శాస్త్రీయసంగీతమంటే ఆసక్తివుందిగానీ నాకు తెలిసింది సున్న.

  4. పాట చాలా బాగుంది. మీరన్నట్లు ఎవరైనా త్యూన్ ఇస్తే గానీ మధ్రం తెలిసిరాదు.
    –ప్రసాద్
    http://blog.charasala.com

  5. really nice, i like it and i will try to tune it.

  6. really nice. I like it and I will try to tune it.

  7. పాట బానే వుంది అలవోకగా చూస్తే

    కానీ ప్రతి చరణం పల్లవితో కలిపి చదువుకుంటే అన్వయింపు నాకు కుదరటం లేదు.
    నా వుద్దేశంలో ఇలా ఒక సంపూర్ణ వాక్యం లాగా అన్వయం కుదరాలి పాటలో.

    ఒక సవరింపు – మధుసూదన – సరైన మాట లో రెండో “ద” కి వొత్తు లేదు.
    అంటే మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడా అని.
    ‘జనార్ధన” అని కూడా అంటారు జనం విరివిగా, దీంట్లో కూడా ద కి వొత్తు లేదు.


మీ ఉద్దేశ్యం…

XHTML: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.