ఇరు చూపుల నడుమ కదిలిన భావ లహరిలో
మన సాన్నిహిత్యం సాహిత్యమా?
ఇరు పొద్దుల మధ్య మెదిలిన నడిరేయి రాగం లో సాంద్ర ప్రణయపు సంగీతమా?
మాటలు సాగినా
మౌనం ముసిరినా
కష్టమంతా పెదవులకే
నవ్వుల నదుల్ని ఆపలేకే
మధురోహల్ని దాటి
పులకింతల్ని మీటి
ఇంత హాయీ ఒక్కటై ఎదుటకొస్తుంటే
ఓపటమెలా కనురెప్పలు మూయకుంటే
very nice post
మీ కవితలు తేలికయిన పదాలతో వున్నా మనసుని బరువు చేసేస్తాయేమిటండి?నాకయితే మీ కవితల్లో చాలా అనుభవమున్న,పెద్ద పెద్ద రచయితల శైలి కనిపిస్తుంది.మీరసలు పుస్తకాన్ని ప్రచురించండి మీ కవితలతో.నేనే ఒక 100 ప్రతులు కొని దాచేసుకుంటాను.
వావ్ వావ్ ఎంత అద్భుతమైన కవిత.
“మాటలు సాగినా
మౌనం ముసిరినా
కష్టమంతా పెదవులకే”
బాగా చెప్పారు పెదవుల కష్టాన్ని.
–ప్రసాద్
http://blog.charasala.com
చదువుతుంటే అందంగా ఆనందంగా అనిపించిందిగాని, నా మట్టి బుర్రకి మీ పాటలో ఆర్ద్రత/భావం అర్దం అవలేదు.
బ్రహ్మంగారి పరిస్థితే నాదీ.
బావుంది.