ప్రేరణ
ఏప్రియల్ 11, 2009 at 6:01 అపరాహ్నం | In పోస్ట్ బాక్స్ | 22 Commentsరాత్రంతా తోట నిండా రాలి పడిన పసుపు గన్నేరు పూలు.
ఓంటరి నా గదిలో కాన్వాస్ పై రంగుల కలలే తెల్లవార్లూ..
అన్నట్టు మర్చిపోయాను ఇవ్వాళ నిన్ను కలవబోతున్నాను కదా! అంటే నిజం గా మర్చిపోయానని కాదు, అంతా మాములుగా ఉన్నప్పుడు ఒక ఇష్టమైన విషయం గుర్తుకు రావటం లో ఉండే ఆనందం కోసం మళ్ళీ మర్చిపోవటం. పుప్పొడి పూతల్లో అణిగి ఉన్న ఆరాటాన్ని గాలి బంధిస్తే అదొక మకరందపు విస్ఫోటనమైనట్టు.. ఇన్నాళ్లూ అణచిపెట్టిన ఉద్వేగమంతా నిన్ను చూడగానే ఎక్కడ నా మాటకి ఎదురుతిరుగుతుందోనని భయం. మనం కలిసి ఇన్నాళ్ళయిందా? ఆశ్చర్యం! ప్రతి నిముషం పలకరించుకుంటున్నట్టే ఉంటుంది. మరి అదేమిటో ప్రతి రోజూ కనపడినప్పుడు మాత్రం యుగాల నిరీక్షణ లా ఉండేది.
‘నన్నెపుడైనా గుర్తు చేసుకుంటావా’ అని నువ్వడిగితే;
వసంతాల్నీ సమీరాల్ని వదిలేసి ,
ఉషోదయాలు, అపరాహ్నాలూ,అసురసంధ్య లు
నా ఉనికినే మరిచిపోయేంతగా లీనమయ్యి చిత్రవర్ణాల్లో అంతర్లోకాల్నిని సృజించుకుంటూ,
ఏ అర్ధరాత్రో ఆకలి తెలిసి,
ఒకదాన్లో ఒకటి ఐక్యమైపోయిన అరచేతుల జంట ఆసరా గా తల వెనక్కి వాల్చినప్పుడు,
మూసిన కనురెప్పల వెనక ఎగసిపడే మొట్ట మొదటి జ్ఞాపకం నీదేనని..
చెప్పనా?
వద్దు, ఇప్పుడు కరిగిపోతే ఎన్నో సార్లు ఘనీభవించటానికి సిద్ధపడాలి.
గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి క్షణం హోరెత్తుతున్న నీ జ్ఞాపకాల కోలాహలాన్ని తప్పించుకోలేని అశక్తుణ్ణి..
‘నేనెప్పుడైనా గుర్తొస్తానా’ అని నువ్వడిగితే..
‘ఊహూ’ తల అడ్డం గా ఊపాను. అన్ని అబద్ధాలూ అందంగా ఉండవు మరి. కోపం తో అరుణిమైన నీ వెచ్చని చూపుకీ ఈ సాయంత్రపు నీలిమ కీ మధ్య ఉభయసంధ్యల వారధిలా నిల్చుని నేను.
మెదడు లోంచి లావా పొంగి హృదయాన్ని దహించివేస్తున్న దృశ్యాన్ని తర్వాతెప్పుడో ఒకరోజు కాన్వాస్ పై చిత్రిస్తే..
ఈ ఆలోచన నీకెలా వచ్చింది అని ఎవరైనా అడిగినప్పుడు, ఇదంతా తవ్వి తలపులకెత్తుకోవటం ఇష్టం లేక ప్లాస్టిక్ పూలమీంచి వచ్చే పెర్ఫ్యూమ్ పరిమళం లాంటి ఒక నవ్వు బదులిస్తాను.
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
మీ ఉద్దేశ్యం…
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.




WOW!
Welcome back, Lady! You were missed the most!
Please keep posting!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — ఏప్రియల్ 11, 2009 #
కల్ హర ప్రియ గారు మీ ప్రేరణ….ఆసాంతం అద్భుత భావన,…ప్లాస్తిక్ పూల మీదనుంచి వచ్చే పెర్ఫ్యూం పరిమళం లాటి నవ్వు నవ్వేస్తాను.ప్రయోగం అభినందనీయం. వ్రాస్తూనే వుండండి. …. Nutakki Raghavendra Rao
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా nutakki raghavendra rao — ఏప్రియల్ 12, 2009 #
Good one.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — ఏప్రియల్ 12, 2009 #
హ్మ్మ్. మీ ప్రేరణతో కొన్ని అనుభవాలు స్పురణకొచ్చాయి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — ఏప్రియల్ 12, 2009 #
beautiful! చాలా బాగుంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఏప్రియల్ 12, 2009 #
నన్ను కదిలించే చాలా తక్కువ కవితల్లో ఇదొకటి. ఇన్నాళ్లకయినా మనసుని తాకే కవిత అందించింనందుకు కృతజ్ఞతలు, మీ కవితాత్మకి అభినందనలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా malathi — ఏప్రియల్ 12, 2009 #
మీలాంటి వాళ్ళతో నాకెప్పుడూ ఇదే ఇబ్బంది. చాలా సంవత్సరాల నుంచీ దాక్కొని, ఉన్నంతలో హాపీగానే ఉంటున్నాను. కానీ ఈ రాతలున్నాయి చూసారూ..దాక్కొని ఉన్న నన్ను బలవంతంగా బయటకు లాక్కొస్తాయి. వెంటనే నాతో దాగున్న హాపీనెస్ ఎగిరి పోతుంది. గుండె సన్నగా మూలుగుతుంది. దాంతో దిగులు మొదలయ్యి నన్నాక్రమించేసుకుంటుంది.
అందుకే ఐ హేట్ యు. Go back to the place where you were hiding all these days. Will you please?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Independent — ఏప్రియల్ 13, 2009 #
Oh! simply superb! welcome back!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Gireesh K. — ఏప్రియల్ 13, 2009 #
This is like a gentle pleasant breeze in the Indian summer. We will put in our May Edition.
Thanks
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా babu — ఏప్రియల్ 13, 2009 #
ఎన్నాళ్ళకెన్నాళ్ళకి…
ఎన్ని ఆహ్లాదమైన భావాలు! ఎంత అందమైన ప్రేరణ!! చాలా బాగుంది
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నిషిగంధ — ఏప్రియల్ 13, 2009 #
మళ్ళీ చాలా రోజులకి! Welcome back!!!
very nice…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా మేధ — ఏప్రియల్ 14, 2009 #
Welcome back swathi gaaru. Loved this poem (or whatever). Particularly this line:
“వద్దు, ఇప్పుడు కరిగిపోతే ఎన్నో సార్లు ఘనీభవించటానికి సిద్ధపడాలి.”
“అశక్తుణ్ణి”? అంటే ఇది మగ స్వగతమా! ఎందుకు ఇలా మమ్మల్ని మిమిక్ చేస్తున్నారు? అదీ ఇంత ఎక్యురేట్‌గా ఎలా?
Keep posting anyway.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Meher — ఏప్రియల్ 14, 2009 #
“అంతా మాములుగా ఉన్నప్పుడు ఒక ఇష్టమైన విషయం గుర్తుకు రావటం లో ఉండే ఆనందం కోసం మళ్ళీ మర్చిపోవటం.”
ఈ వాక్యం అద్భుతంగా ఉంది. మిగతాదంట్లో సువాసనలపాళ్ళు ఎక్కువైనాయి.
BTW, welcome back!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — ఏప్రియల్ 14, 2009 #
sincerely speaking, this is the post I liked the most!!!!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా aswinisri — ఏప్రియల్ 15, 2009 #
మీరు ఇలాంటి మాటలు చెపుతామంటే ఎంత కాలమైనా ఎదురుచూస్తాము.అవునుమరి ఒక్కోసారి గుండె బరువెక్కినా బావుంటుంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఏప్రియల్ 17, 2009 #
Nice
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Brahmam — ఏప్రియల్ 18, 2009 #
స్వాతి
మీ ప్రేరణ చాలా బాగుంది.
” ప్రతి క్షణం హోరెత్తుతున్న నీ జ్ఞాపకాల కోలాహలాన్ని తప్పించుకోలేని అశక్తుణ్ణి..”
ఈ వాక్యం చాలా చాలా నచ్చింద.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Suresh — మే 15, 2009 #
chaalaa baavundi…. keep writing!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా subrahmanyam — మే 24, 2009 #
Dear Swathi
E vakyam naku baga nachindi
ప్రేమంటే……….
“ఒక హృదయ స్పందన ని మరో హృదయం అనుభూతి చెందటం”
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Nagalakshmi — జూన్ 20, 2009 #
good nice one
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా kolisetty — జూన్ 20, 2009 #
Un-be-li-ev-able
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శరత్ చంద్ర — జూన్ 30, 2009 #
BAvundi
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా aswin budaraju — సెప్టెంబరు 4, 2009 #