అనుమానం;
చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు
కంటికి సమాంతరంగా సాగని చూపులు
ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు
—–
నమస్కారం;
తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి
మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి
వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు వంచనకి
—–
అవసరం;
గాయపడని చోట ముందు చూపుతో కాస్త మందు
ఆత్మను కాపాడుకోడానికి అహానికో చెంపదెబ్బ
ఇంకా నేర్చుకోని పాఠాలకి కాసేపు విరామ చిహ్నం
—–
మొదటి ప్రచురణ మాలికలో



చాలా బావున్నాయి స్వాతి గారూ…