భాష

నాకు తెలిసిన మూదో తరగతి చదివే పాప ఇంటికి ఆలస్యం గా వచ్ఛి తన నాన్న తో  "Dad, i go to my friend
home. So come late" అని చెప్పటం నాకు తెలుసు. పసితనం నుంచి ఇంగ్లిష్ తప్పనిసరి గా మట్లాడాలి అని రూల్ పెట్టే
బడులు ఇటువంటి పనికిమాలిన ఇంగ్లిష్ నేర్పేకన్నా పిల్లల్ని తెలుగు లో మాట్లడుకోనివ్వటం నయమేమో అనిపిస్తుంది. స్కూల్ దశ లో
ఏ మీడియం లో భోదించాలి అనే దాని కన్నా భోధనా విధానం ముఖ్యం అన్నది నా అభిప్రాయం.బట్టీ కొట్టించే పద్ధతే అనర్ధాలకు మూలం. ఏ భాష లో ఐనా   expert knowledge వున్నవాళ్ళను గమనిస్తే భాష మీద వారి వ్యక్తిగత శ్రద్ధ, కౄషి, వారికా ఆసక్తి
కలిగేలా చేసిన గురువు, స్నేహితుడు లేదా పుస్తకం ఇలాంటి కారణాలు ఉంటాయి. తెలుగు మీడియం చదివి వ్యావహారిక,గ్రాంధిక
తెలుగు రాని వాళ్ళని, పుట్టినప్పట్నుంచి ఇంగ్లిష్ లో చదివి సరయిన ఇంగ్లిష్ మాట్లాడలేని వాళ్ళని మనందరం చూసే ఉంటాం.
పుట్టినప్పట్నుంచి ఇంగ్లిష్ లో చదివి 'అభిజ్ఞాన శాకుంతలం''john keats poetry' రెండూ చదవగలిగే స్నేహితురాలు నాకుంది. పిల్లలకి ఏం చెప్తున్నాం అనే దానికన్నా దాన్ని ఎలా
చెప్తున్నాము అనేది చాలా ముఖ్యం. ఏది చెప్పినా
అందులోని లాజిక్ వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పగలిగితే సమస్యే లేదు. తెలుగు అనేది కెవలం భాష కాదు. అది ఒక తన్మయత్వం. ఒక సుధా ఝరి. సామెతలు, మాండలీకాలు,నుడికారాలు, చంధస్సు లోని అందాలు, కవిత్వం లోని కమ్మదనాలు ఇలా ఎన్నిటినో నేటి తరం ఆస్వాదించలేకపోతున్నారు. మన చిన్నప్పటిలా పద్యాలు నెర్పే తాతయ్యలు, కధలు చెప్పే నాన్నలు ఇప్పుడు తక్కువ. పాఠ్య పుస్తాకాల్లొ వేమన, సుమతి పద్యాలకి స్థానమే లేదు.మేము చిన్నప్పుదు మాకు పెద్దలు పనికట్టుకుని tv లో వచ్చె మహా భారతం,రాజ శేఖర చరిత్ర, తెలుగు ఆణి ముత్యాలు,తెలుగు కవులు ఇలాంటి కర్యక్రమాలు చూపింఛే వారు.ఇప్పుడలాంటివి
ప్రసారం అవ్వటము అరుదే (private channels  లో). DD లో వచ్చినా  వాటిని పిల్లలకి నేర్పించాలనుకునే పెద్దలూ
అరుదే. చిన్నపిల్లలతో కలిసి తల్లిదంద్రులు అసభ్యమైన సినిమా పాటలు చూడ్డమే కాకుండా చిట్టి చిలకమ్మ అని చదవాల్సిన
వయసులో సినిమా పాటలు, స్టెప్పులు కావాలని నేర్పించటం. నేను అసలు విషయానికి చాలా దూరం వచ్చేశాను.
కానీ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న విషయాలు అనిపిస్తుంది. నా చాదస్తం తో మిమ్మల్ని విసిగించి ఉంటే క్షమించండి.

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

2 Responses to భాష

  1. రానారె అంటున్నారు:

    నేను క్షమించనండీ. అసలు ఎందుకు క్షమించాలండీ మిమ్మల్ని? అసలా అవసరముంటేగదా! నేనూ నా పిల్లకు వీలైనన్ని పద్యాలు నేర్పాలని అనుకొంటున్నాను నిశ్చయంగా. చూద్దాం వాళ్ళు పుట్టాలి, పుట్టాలంటే నాకు పెళ్ళి కావాలి. ఈ లోగా నేనే వీలైనన్ని కొత్త పద్యాలు నేర్చుకుంటా.

  2. పింగుబ్యాకు: నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు » Blog Archive » బ్లాగుల సరస్సులో వికసించిన కల్హారం ..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s