పూలు – ముళ్ళు

Hi.gif

ఆ తోట నిండా గులాబీలు..

అక్కడి గంపల నిండా జ్ఞాపకాలు

కొన్ని తాకగానే గుచ్చుకునేవి

కొన్ని ఏదో గుర్తొచ్చి నొచ్చుకునేవి

కొన్ని నన్ను చూసి మెచ్చుకునేవి

ఒక వర్షం వెలిసిన సాయంకాలం

అవన్నీ తలకెత్తుకుని బయల్దేరుతాను

దారిలో కొన్ని పంచుకుంటూ

కొంత గుండె బరువు దించుకుంటూ

కొన్ని మాత్రం ఎప్పటికీ దాచుకుంటూ…

-స్వాతి

4 thoughts on “పూలు – ముళ్ళు

Leave a reply to Uma స్పందనను రద్దుచేయి