గీతాంజలి – సమీక్ష

                       images.jpg

"సహనం తో తలకిందికి వంచి నక్షత్రాలతో నిరీక్షించే రాత్రి వలే నేను కూర్చుని ఉంటాను.
తప్పదు, తెల్లవారుతుంది. స్వర్ణ ధారలతో ఆకాశాన్ని చీల్చుకుని నీ కంఠం వర్షిస్తుంది. నా కులాయం లోని ప్రతి పక్షి నీ పాటలు రెక్కలుగా చాస్తాయి.ఈ అరణ్య నికుంజాలలో నీ రాగాలు పువ్వులుగా బ్రద్దలవుతాయి"

ప్రతి కొత్త dairy లోను మొదటి పేజి లో రాసుకోవటనికి నేనిష్టపడే వాక్యాలవి. గీతాంజలి కి చలం శైలి చేకూర్చిన అందం అది."తప్పదు తెల్లవారుతుంది" అనటం నాకెన్నో సార్లు స్పూర్తినిచ్చింది. చీకటి ఎంత తప్పనిసరో వెలుగు కూడా అంతే
అనే భావం ఎంత వాస్తవం!

సాగర తీరాల్లో పిల్లలు ఇసుకలో ఆడుకుంటారు. వాళ్ళకి సముద్ర గర్భం లో దొరికే సంపద మీద ఆశ లేదు.
వొడ్డునే ఇసుక గూళ్ళు కట్టుకుని ఆనందిస్తూ ఉంటారు. పిల్లల అమాయకత్వాన్ని ప్రతిబింబించే గొప్ప విషయం అది.

ఇంకో చొట ఒకమ్మాయి ని కవి దీపం ఇవ్వమని అడుగుతాడు. నా ఇల్లు చీకటి గుయ్యరం గా ఉంది అమ్మయీ నీ దీపం ఇవ్వవా అని. ఆమె ఎంతకీ ఒప్పుకోక వేలాది దీపాలు ఉన్న ఉత్సవం లో దాన్ని కూడా తీసికెళ్ళి చేరుస్తుంది. అవసరానికన్నా ఆడంబరానికి ఇచ్చే ప్రాముఖ్యత చాలా అందం గా వ్యక్తీకరించబడింది. 

నువ్వు చుట్టు ఉన్న గోడలను ఛేదించుకుని ఈ ఖైదు నుంచి బయట పడలేవు. ఎన్నో ఏళ్ళుగా శ్రద్దగా నీ చుట్టూ గోడలను నువ్వే నిర్మించుకున్నావు. తీరా పూర్తి చేసాక చూస్తే ఆ గోడల మధ్య నువ్వే బందీవైపొయావు. 
బంధాలని ఎంతో ఇష్టం తో నిర్మించుకుని ఒకానొక రొజున వాటిని దూరం చేసుకోవటం ఎంత కష్టమో.

భక్తి అనే పేరు తొ ఈ చీకటి గుడిలో ఒక మూల కూర్చుని ఎందుకు ఈ జపం. నీక్కావల్సిన దైవం ఇక్కడ లేదు.
మట్టిలో, ఎండలో కష్టపడే శ్రామికుడి దగ్గర ఉంది దైవం అని హెచ్చరించిన జాగృతి కనిపిస్తుంది.
 
మీ దగ్గర నుంచి నేను శెలవు తీసుకునేప్పుడు ఇక్కడ నేను అనుభవించింది అనుపమానం అనేది నా చివరి మాట గా ఉండిపోనివ్వండి అని చెప్పటం ద్వారా రవీంద్రునికి జీవితం పట్ల ఉన్న కృతజ్ఞత అర్ధం అవుతుంది.

సాహిత్యం మీద యే కాస్త ఆసక్తి ఉన్న వారైనా చదివి తీరవలసిన పుస్తకం గీతాంజలి.

-స్వాతి

ప్రకటనలు

About Kalhara

Hi, I am swathi from Hyderabad, India. Interested in reading and writing down few thoughts.
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

9 Responses to గీతాంజలి – సమీక్ష

 1. రాజు అంటున్నారు:

  ఆ పుస్తకం కొన్నానండి..కాని నా స్నేహితుడు ఎక్కడో మిస్ చేశాడు. ఈ వారం లో కొని చదవాలి. అది చలం అనువదించాడని నాకు ఇంతవరకూ తెలియదూ!… థాంక్స్

 2. Chinthu అంటున్నారు:

  ఠాగూర్ “గీతాంజలి” కి చలం గారి అనువాదం…బంగారాని కి తావి అబ్బినట్లు!
  (తావి = సువాసన)

 3. పిచ్చోడు అంటున్నారు:

  గీతాంజలి ని అనువదించింది చలం గారా!!!! ఇన్ని రోజులు ఈ విషయం తెలియనందుకు ఒకింత సిగ్గుగా ఉందండీ…. చాలా ధన్యవాదాలు. వెంటనే కొంటాను

 4. నెటిజన్ అంటున్నారు:

  అయ్యో! అయ్యో! మది రోదిస్తున్నది!
  ఇక్కడ చదివిన కొన్ని వ్యాఖ్యలు ఎంత ఇబ్బంది పెడుతున్నవో! ఈ పాఠశాలలు, కళాశాలల్లోని అధ్యాపకులు ఏం చదువుకున్నారో! ఏం ఉద్యోగాలు చేస్తున్నారో! జీతం కాసులేనా వీరికి? జీవించడం అంటే, అంతా కాసులేనా!

 5. bollojubaba అంటున్నారు:

  నెటిజను గారికి
  రాళ్లు కొట్టే ఉద్యోగానికి ఎక్కువ జీతం వస్తుందంటే సదరు డిగ్రీకై కోచింగులు తీసుకోవటానికి ఎగబడే సంధికాలంలో ఉన్నాం మనం —- తాలసు గారు.
  ఇక గీతాంజలులు, చలాలు, గోపీచందులు ఎవరిక్కావాలి?
  ఏంటో మన భ్రమలు కానీ.

  గీతాంజలిని సమీక్షించటం సాహసమైనా మంచి ప్రయత్నం చేసారు.
  స్వాతి గారు అభినందనలు.

 6. ఏకాంతపు దిలీప్ అంటున్నారు:

  “నీవు పలుకకపోతే నీ మౌనాన్నే నా హృదయం నిండా నింపుకుని ఓర్చుకుంటాను
  నేను కదలకుండా రాత్రిలా నక్షత్రాలనే కళ్ళుగా చేసుకుని జాగురుకతతో
  తలవంచుకుని సహనంతో ఎదురుచూస్తాను
  తప్పకుండా తెలవారుతుంది, అంధకారం అంతర్ధానమవుతుంది
  అపుడు నీ స్వరం దివ్యమైన తరంగిణిలా నింగిని చేధించుకుని జాలు వారుతుంది
  నీ మాటలు నా ప్రతి పక్షి గూటి నుండి పాటల్లా రెక్కలు విచ్చుకుంటాయి
  నీ రాగాలు నా వనాల్లో పువ్వుల్లా వెల్లువిరుస్తాయి ”

  ఇది నే చేసుకున్న అనువాదం… గూగుల్ లో గీతాంజలి అని వెతికితే మీ సమీక్ష దొరికింది… నా అనువాదం ఇక్కడ పెట్టాలనిపించింది..

  నీ బదులు { గీతాంజలి ~ 15 } http://ekantham.blogspot.com/2010/08/15.html

 7. appala naiddu barla అంటున్నారు:

  thakyou…verymuch , iam newcommar to the blog world, but really iam enjoying… this. i feel same myself . becose i didn`t know about this. telugu geethanjali was translated by chalam.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s