అనుకోకుండా ఓ ఉత్తరం

2005061501090401.jpg

నానీ,
నువ్వెప్పుడూ ఉత్తరాలు రాయమంటావ్,ప్రతిసారీ “సరే” అని నేను నాకే నమ్మకం లేని ఒక సమాధానం చెప్తాను.
మేమంతా ఈ రోజు వారీ జీవితం లో ఎంతగా మునిగిపోయామంటే పని చెయ్యటం కాకుండా ఇంకేమైనా చెయ్యొచ్చనే అలోచన రానంత.busy, టైం లేదు ఇవి గత కొన్నేళ్ళుగా అసహ్యించుకుంటునే నేను ఎక్కువగా ఉపయోగించే మాటలు.

డబ్బు, హోదా, ఫ్లాట్లు ఇలాంటివన్నీ మెల్లగా ఎప్పుడో అలోచనల్లో చేరిపోయి మిగతా వాటిని పక్కకు తోసేసిన విషయం నేనెప్పుడు గమనించలేదు సుమా!!
నీ మాటలు విన్నప్పుడు మనసు కొద్దిగా కదిలినట్టనిపిస్తుంది. బీచ్ లో సాయంత్రాలు, స్నేహితులతో అర్దరాత్రివరకు కబుర్లు,చదువులో పోటీలు ఇవన్నీ నీ ప్రపంచాన్ని నింపేసే
అతి ముఖ్యమైన విషయాలు.ఆ దశ దాటిపోయాక అంతటి అమాయకత్వం మళ్ళి వస్తుందా..

చెప్పటం మరిచిపోయాను ఒక ఫ్రెండ్ పెళ్ళికి మొన్నే మీ వూరు అదే సిద్దాంతం వెళ్ళాను,కంప్యుటర్ కొమ్మల మీద నుంచి కొబ్బరాకుల మీద వాలినట్టనిపించింది.
నీకు బాగా గుర్తుండే ఉంటుంది కార్తీక పౌర్ణమి కి మనమంతా గొదావరి వెళ్ళటం, ఒడ్డున శివాలయం లో పారిజాతాలు ఏరుకోవటం,పట్టు పరికిణీల అమ్మాయిల్ని నువ్వు ఆసక్తి గా చూడ్డం:). చలంటే భయం లేదు, ఎండంటే లెఖ్ఖ లేదు, వానొచ్చినా దిగుల్లేదు, ఎన్ని ఆటలు ఇసుక తిన్నెల్లో.ఎన్ని పడవ ప్రయాణాలు వెన్నెల్లో. అవును నువ్వింకా పెద్ద గొంతుతో వచ్చీ రాని పాత పాటలు పాడుతున్నావా?

ఎందుకో మనసు లొ ఇవ్వాళ ఒక చిన్న చెమరింత.

గతం ఎప్పుడూ అందం గా ఉంటుందా? ఏమో అందమైన గతం మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది.

*తెలుగు వెలుగులు లో

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

5 Responses to అనుకోకుండా ఓ ఉత్తరం

 1. charasala అంటున్నారు:

  ‌బాల్య స్మృతుల అందాలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. అమ్మ కొట్టిన దెబ్బలూ, మాస్టారు పెట్టిన తొడపాశాలూ కూడా!! మీ తోట చాలా బాగుంది.

  — ప్రసాద్

 2. Nagaraja అంటున్నారు:

  ఉత్తరాలు వ్రాసి ఎన్నాళ్ళయిందో! ఫోను, కంప్యూటర్లు వచ్చిన తరువాత ఉత్తరాలు వ్రాయడం కూడా గతం అయిపోయింది…

 3. srinu అంటున్నారు:

  బాగ వ్రసినందుకు చాల థంక్స్

 4. joshmybench అంటున్నారు:

  uttaralu rasi rasi.. emails jawabuga ravadam tho… naa alavatu poyi..asalu mails kooda leni jeevitam la tayyarayindi… manchi uttaram raddam ani anipinchindi mee uttaram choosi!!! kaani meeke post cheyyalemo… id lu tappa address lu dachukovadam poyindi…
  manchi telugu blog choosanu innallaku…
  thanx… keep posting! njoy!!

 5. jaya అంటున్నారు:

  manasu poraralalo ni thadi ni eppatiki gurthuchese thadi gnapakam …………….balyam
  adi mee “anukokunda uttaram” lo baga chepparu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s