రహస్యం

waterhouse18.jpg
అలవాటు పడిన అడుగుల సడి దగ్గరవగానే వూపిరి బరువెక్కి ఆశ నిరాశలు ఆత్రపడి
కలిసి ఉన్న కాసేపూ మాటలు కలత పడి
ఉద్వేగపు బరువు మోయలేక గోడకు చేరగిలబడి
నువ్వెళ్ళినవైపే చూపుల చినుకులు పడి
తల వంచుకున్నా, కళ్ళు దించుకున్నా పెదవులు చిరునవ్వు వలలో పడి
ఇంతకు మించి చెప్పలేక నేను అయోమయ పడి
నువ్వే అర్ధం చేసుకుంటావని ఆశ పడి.

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

10 Responses to రహస్యం

 1. charasala అంటున్నారు:

  మళ్ళీ మళ్ళీ చదివాను ఆనందపడి
  ఈ బొమ్మ ఎలా సంపాదించారని ఆశ్చర్యపడి
  మరిన్ని కవితలు చదవాలని ఆశపడి
  ఎన్నోసార్లు వస్తాను మీ బ్లాగు కి త్వరపడి
  మీ కవిత లేకుంటే నిట్టూరుస్తాను బాధపడి
  — ప్రసాద్

 2. charasala అంటున్నారు:

  “నువ్వెళ్ళినవైపే చూపుల చినుకులు పడి” — చాలా బాగుంది.
  — ప్రసాద్

 3. swathikumari అంటున్నారు:

  ప్రసాద్ గారు, ప్రాస తో భలే చక్కగా చెప్పారే!!!

 4. Sriram అంటున్నారు:

  chAlA bAgundi padAla pondika…

  randhrAnveshana anukokapothe naavi rendu mukkalu…
  “maaTalu kalatapaDi” anaDam lo mee bhaavam?…did u use it in the meaning of “taDabaDi”?

  “ఇంతకు మించి చెప్పలేక నేను అయోమయ పడి”
  vellipOyaka inka yEmi cheppagalaru…ilaa unTE inkaa baagundunemo anipinchindi….

  తల వంచుకున్నా, కళ్ళు దించుకున్నా పెదవులు చిరునవ్వు వలలో పడి
  ఇంతకు మించి చెప్పలేక నేను అయోమయ పడి
  నువ్వెళ్ళినవైపే చూపుల చినుకులు పడి
  నువ్వే అర్ధం చేసుకుంటావని ఆశ పడి.

 5. swathikumari అంటున్నారు:

  ఈ దశ లో మాటల నిండా ఒక బరువు ఉంటుంది. ఒక మధన.. దాన్నే కలత అన్నాను..

  ఇదంతా మనిషి ఉంటే చెప్పడం కాదు మనసులో చెప్పుకోవడం..
  ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పాక ఇంత కన్నా ఇంకేమి తోచక అలా అనటం అన్నమాట.

  ప్రేమ లో నవ్వు దూరం గా ఉన్నప్పుడు వచ్చే జ్ఞాపకాల వల్ల కలుగుతుంది అందుకే చివర్లో నవ్వు గురించి.

  ఏమో నాకు తెలిసింది తెలిసినట్టు రాశాను..
  ఈ విషయం లో మాత్రం లాజిక్ కన్నా అనుభవాన్ని ఎక్కువ నమ్ముతాను.

 6. Srinivasa Indukuri అంటున్నారు:

  చాలా బాగుంది..

 7. Sriram అంటున్నారు:

  ఇందులో తెలియడానికి ఏముందండీ…ఎవరి భావన వారిది…వాదన కోసమో, తప్పులు పట్టడం కోసమో కాదండీ…మీ భావాన్ని అర్ధ్హం చేసుకునే ప్రయత్నం మాత్రమే…తప్పుగా అనిపిస్తే క్షమించండి…

 8. swathikumari అంటున్నారు:

  No, i was just explaining my view to clarify you. Ther’s nth like arguement.
  Thanks for expressing your opinions analytically.
  Comments like urs are always valuable.:)

 9. radhika అంటున్నారు:

  chaalaa chaalaa nachindandi.mee pada prayogam chaala baagundi.mee kavita cadivaakaa alanti aalocanale chaalaa vachayi.na site lo raste..copy anukuntaremo?

 10. Uma అంటున్నారు:

  వ్రాస్తున్నా ఇది నే ఇష్టపడి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s