రైల్వే క్రాసింగ్ దగ్గర

ట్రైన్ లో పై బెర్త్ అంటే నాకెప్పుడు ఇష్టమే. తోటి ప్రయాణీకుల నిద్ర వేళల్ని బట్టి నేను సర్దుకోవాల్సిన పనుండదు. అసలింతకీ నాకు సాంబారు పెరుగు మరకలతో ఆహ్వానించే కింది బెర్తులంటే ఒకలాంటి భయం. మరోలా అనుకుంటారేమో నేను మాత్రం అలా ఏమీ ఒలకబొయ్యను అది నా బెర్త్ కాకపోయినా సరే. ఇంకేముంది నాకిష్టమైన అప్పర్ బెర్త్ లో చక్కగా నిద్ర ని ఆస్వాదిస్తూ ఉన్నాను నా సెల్ ఫోన్ లో అలారం అందర్ని గోల పెట్టి లేపే వరకు. కొంచం విసుగ్గా ఐనా నా కింద అతను నిన్నటి నా మాటల్ని గుర్తు పెట్టుకుని నన్ను నిద్ర లేపాడు. బద్దకాని కొద్దిగా వదిలించుకుంటూ మెడ వంచి బయటికి చూసాను. పసుపు పచ్చని రైల్వే బోర్డ్ మీద “కొవ్వూరు” అనే అక్షరాలు చూడగానే చెంగుమని తిన్నగా కూర్చున్నా ఈ అందమైన ఉదయాన్ని వదలకూడదు అని తీర్మానించుకుని.

తెల్లవారుఝాములు నాకు చాలా ఇష్టం కాని అవి మరీ అంత పొద్దున్నే ఉండటమే బాగోదు. సుప్రభాతాల్లోని సౌందర్య స్పష్టత ఎంతో అహ్లాదం కదా!! డోర్ దగ్గరకి వెళ్ళి బయటకి చూస్తే వంపులు తిరిగిన వంతెన దగ్గరవుతూ పులకరింతల్ని పంపింది.

1.jpg

గోధూళి వేళ ఆటల్లో అలసిపోయి అమ్మ ఒడిని చేరే అవ్యక్తమైన ఆనందం ఈ నదిని దాటుతున్న ప్రతిసారీ కలుగుతుంది. రైలు చక్రాల లయ మారగానే వంతెన మీదకొచిన్నట్టు తెలిసిపోతుంది. S1 పెట్టె నుంచి ఒక పెద్దాయన ఉత్సాహం గా ఆ అందాన్ని కళ్ళల్లో నింపుకోవలన్న అత్యాశ తో బయటికి తొంగి చూస్తున్నాడు.

2.jpg
నది ఎప్పుడూ నిండు గా ఉండదు కానీ నిరుటి వర్షాల వల్ల పూర్ణత్వాన్ని సంతరించుకున్నట్టు కనువిందుగా కదుల్తుంది.

3.jpg

ఆలా వెళ్తూ నదిని అలంకరిస్తున్న ఇసుక తిన్నెల్ని ఇంకా అదృష్టముంటే పరుగులు తీసే కృష్ణ జింకల్ని చూడొచ్చు.

4.jpg

తల తిప్పుకోబోతుంటే నదిలో రెండు జాలరి పడవలు ఆటలాడుతున్నట్టు అనిపించి. చూడబోదును కదా ఇనప ఊచ ఒకటి అడ్డొచ్చేసింది.

5.jpg
ఈసారి వదుల్తానా ఎలాగో జరిగి చూస్తే అవి రెండు కాదు మూడు లా ఉన్నాయి.మీకు అలానే అనిపిస్తుందా?

61.jpg

ఆ పడవ లో వ్యక్తి నన్ను, నా కెమెరా ను చూసి చక్కగా ఫొటోొ కి పోజ్్ ఇచ్చి నుంచున్నాడు. అవకాశం దొరికింది కదా అని ఇనప ఊచలు అడ్డు రాకూడదు అని వేడుకుం‌టూ క్లిక్ మనిపించాను మొత్తానికి.

7.jpg

ఆరె!! ఇంకో బోట్ లో ఉన్న ఇద్దరు బాగా దగ్గరగా ఉన్నట్టుందే . ప్చ్ అటు వైపు తిరిగున్నారు. ఏలా ఐనా ఒక స్నాప్ సంపాదించాలి అని లేస్తున్నానా ట్రైన్ కదలటం మొదలైంది. ఎలాగో ఇలా తీసాను చివరికి.

8.jpg

నది ఆవలి ఒడ్డుకి చేరుతున్నామని తట్టింది బుర్రకి కనుచూపు మేరలో బోలెడన్ని పడవలు ఆఅహ్వానిస్తున్నట్టు ఉండేసరికి.

9.jpg

ఉన్నట్టుండి వెనక్కి తిరిగితే.. నది తో పాటు బ్రిడ్జ్ హృదయాన్ని ముంచేసేంత ప్రశాంతమైన సౌందర్యం తో.

10.jpg

క్షణాలు గడుస్తూ ఉండగా ఒక రైల్వే బోర్డ్ మా దారిలోకి వచ్చింది.
ఆ అద్భుతమైన అక్షరాల వంక తన్మయత్వం తో చూస్తుండిపోయాను,అవి గోదావరి.

11.jpg

*శ్రీరాం గారి A crossing అనే వ్యాసానికి తెలుగు అనువాదం.

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

11 Responses to రైల్వే క్రాసింగ్ దగ్గర

 1. పింగుబ్యాకు: సంగతులూ,సందర్భాలూ…. » ఎ క్రాసింగ్ …

 2. సుధాకర్ అంటున్నారు:

  మాకు మీ పక్కనే నించుని గోదావరి చూసినంత అనుభూతి కలిగించారు …చాల బాగుంది.

 3. cbrao అంటున్నారు:

  While reading this blog, I felt as if myself crossing the bridge. Good translation and nice photos complemented each other. The beauty of river Godavary, early in the morning in all its vivid colors is well presented.

 4. chaitanya అంటున్నారు:

  adbhutam gaa undi swathi gaaru!

 5. ram's అంటున్నారు:

  nice one swathamma!!!!!!!!

 6. Raem అంటున్నారు:

  Really good one , thining of converting on of the pics to wallpaper.

  and thnaks for Sri ram even .

 7. radhika అంటున్నారు:

  wow..ma godari ni enta baga varninncharandi.nelaki oka saranna ee anubhutini podedaanini.ippudu anta adrustam ledu.roju cuse nenu chuse na godarena..intha andam ga vundi swati maatallo?

 8. Balu అంటున్నారు:

  Godari andhalanu, godari vodduna naa anubhuthulanu gurthu chesinandhuku … meeku chala chala dhanyavadhalu.

 9. hari krishna అంటున్నారు:

  godavari shekar kammula cinema lage chala bagundi.

 10. nagaraju అంటున్నారు:

  very nice i think u & sekhar kammula have same eelings about godavari.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s