ప్రియమైన తాతయ్య కి

   untitled1.jpg

తాతయ్యా,
ఇప్పుడు మన ఊరు వెళ్తే అక్కడ మనుషులు, మన ఇల్లు ఏదీ మారలేదు.నువ్వు లేవనే దిగులు మాత్రం అక్కడున్న కాసేపు ఏ మూలో తొలుస్తూ ఉంటుంది.

అందరికీ పెద్ద మనిషివైనా  చిన్న పిల్లాడివై నాతో కుందుళ్ళు ఆడటం,నువ్వు చెప్పిన పద్యం లో నేను తప్పు చూపించానని యేళ్ళ తరబడి నువ్వందరికీ చెప్పుకుని మురిసిపోవటం,
ఉత్సవాలప్పుడు రాత్రి చలిలో హరికధ వినటానికి నీ దుప్పటి తీసుకుని నేను ముందు పరిగెత్తటం…
ఇంకా నిన్న మొన్నటి తడి జ్ఞాపకాల్లా ఉంటాయి.

చెరువు గట్టు మీదో, గుడి అరుగు మీదో ఒంటరిగా కుర్చుంటే “శ్రీ వక్షోజ కురంగనాభ మొదపై”అని పాడుతునో,”కలడు కలండనెడు వాడు కలడో లేడో” అని అనుమాన పడుతునో పక్కనే కూర్చుని వున్నావా అనిపిస్తుంది.

చేనికి వెళ్ళినప్పుడు, ఇంటిదగ్గర రాత్రి పూట లాంతరు వెల్తుర్లో మీగడ తో కలిపి ఆవకాయ ముద్దలు నువ్వు చేసినట్టు చెయ్యటం నాకిప్పటికీ రాదు.

అన్నట్టు ఇది మర్చిపోయా. నీకు పై పంచె తో తలపాగా చుట్టటానికి చెల్లి నేను గొడవ పడి అదే గెలిచి నేను అలిగితే, అది నీ తల అందక బల్లెక్కి కిందపడి ఏడిస్తే అందరం నానమ్మ తో తిట్లు తినటం!!

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

4 Responses to ప్రియమైన తాతయ్య కి

 1. charasala అంటున్నారు:

  స్వాతి గారూ!
  ఇది మనసును తాకుతూ ఉందని చెప్పటానికి చెమ్మగిల్లిన నా కళ్ళ తడి ఇంకా ఆరకపోవటమే సాక్షి.
  ప్రకృతికి sine wave pattern అంటే ఇష్టమట. పసిపిల్లాడిగా ప్రారంబమయ్యే మనిషి జీవితం మళ్ళీ పసిపిల్లాడిలాంటి వృద్దాప్యంతో ముగుస్తుంది. పిల్లలకు తాతయ్య కంటే మంచి మిత్రుడెవరు?
  రాత్రి చలిలో తాతయ్య దుప్పటిలో దూరి హరికథ వినటం.
  తాత తెల్లని మీసాలతో ఆడుకోవటం.
  తన చిటికెన వేలు పట్టుకొని చెరువుగట్టంబడి నడవడం.
  ఆ అనంద స్మృతుల్ని గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు.

  — ప్రసాద్

 2. Srinivasa Indukuri అంటున్నారు:

  Excellent.. keep it up. i have similar idea in my mind. but related to oldage..

 3. Ramanadha Reddy అంటున్నారు:

  మీకేమో మీ తాతగారితో మంచి అనుబంధం. నాకు మాత్రం మా తాత బీడీ పొగ పడేది కాదు. శనివారం సంత నుంచి కూరగాయలతోపాటు రెండు పేద్ద రసూల్ బీడీ పొట్లాలు తప్పనిసరి. మా తాత ఇంటిబయట చింత చెట్టు కింద తెల్ల బండపై కూర్చొని వదిలే పొగ చేతనే ఆకాశంలో మేఘాలు తయారయినాయటే మీరు నమ్మరేమో …

  నా రచనపై మీ వ్యాఖ్యకు సంతోషం. ధన్యోస్మి. మీ లాంటివారి మాటతో నేనో చిరు రచయితనయినట్లున్నాను.

 4. radhika అంటున్నారు:

  ippudu namanasu bagoledandi.emi cheppalo teleetledu.tatayya gurtostunnaru.chivari chupuku kuda nochukoni nenu ika jnaapakaallone kaburulu ceppukuntunnanu.chivari chupu cudakapovadam kuda oka adrustamenemo?taninka vunnadane bhavanalo vundagalugutunnanu.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s