అమృతం కురిసిన రాత్రి

184_front_cover.jpg

“ఒక నిశార్ధ బాగంలో నక్షత్ర నివహగగనం
ఓరగా భూమ్మీదకు ఒంగి ఎదో రహస్యం చెప్తున్న వేళ
ఒంటరిగా నా గదిలో నేను మేల్కుని రాసుకుంటుంటాను”
ముందే తెలిసి ఉంటే ఆ అమృతం కురిసిన రాత్రి నేనూ మేల్కుని ఉందును కదా అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివితే.
ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వం గా కూడా అనిపించనూ వచ్చు.

“గాజు కెరటాల వెన్నెల సముద్రాలు
జాజి పువ్వుల అత్తరు దీపాలు”
తిలక్ వూహా ప్రపంచాన్ని మనకు ఆవిష్కరిస్తే
“చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క”
ఆయన మనసులోని గాలి అలకే స్పందించే కవితాత్మకమైన సింప్లిసిటీ ని చూపిస్తాయి.
మన వూరి మీద, పల్లెటూరి మీద మనందరికి ఉండే సహజమైన మమకారం “పాడువోయిన వూరు” అనే కవితలో “ప్రాణం గల పాడే వేణువులీ ఇసుక రేణువులు”
అని చదివినప్పుడు మనసు పొరల్లో మళ్ళీ మేల్కొంటుంది.

“సి. ఐ.డి రిపోర్టు” అనే కవితలో సాధారణ మధ్య తరగతి గుమస్తా అతి సామాన్య జీవితాన్ని మనస్తత్వపరం గా కూడా విశ్లేషించటం ఎంతో సహజం గా ఉంటుంది.
ఈయన స్త్రీ లని మాత్రం వదిలారా! ఎంత చమత్కారి కాకపోతే
“నవలలు నవలలు రాసేస్తున్నారు
వర్ణనీయ వస్తువే తిరగబడి వర్ణిస్తుంటే
హత విధీ ఇది కలి కాలం, కలికి కాలం”
ఇలా అని ఒక గౌరవనీయ అభిప్రాయాన్ని ఇంత చిలిపిగా చెప్తారు.

“నీ ఒడి లో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ
వినీల శిరోజ తమస్సముద్రాలు పొంగి నీ బుజాలు దాటి నా ముఖాన్ని కప్పి
ఒకటే ఒక స్వప్నాన్ని కంటున్న వేళ”
“నువ్వు లేవు నీ పాట ఉంది” అని ఆర్ద్రత ఒలికించి భావ కవిత మాత్రం గంభీరమైన భాషోద్వేగానికి లోనయ్యింది.

“మౌఢ్యం వల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు”
మూర్ఖత్వం లొని మొండితనాన్ని, మనకున్న కొన్ని నమ్మకాల్లోని అజ్ఞానాన్ని నిర్భయం గా నిర్మొహమాటం గా చెప్పిన మాటలవి.
విషాదానందాల్ని, భావ సంచలనాల్ని, సామాజిక వాస్తవాల్ని, మూర్తీభవించిన దైన్యాన్ని, హైన్యాన్ని, అవేశాల తీరాల్ని,
అలోచనల అంచుల్ని ఇంకా నేను గమనించలేని ఎన్నిటినో ఒక చోట కూర్చటమే కాకుండా వర్ధమాన కవిత కి సందేశాన్ని ఇవ్వటం కూడా మర్చిపోలేదు.
“నువ్వు చెప్పేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, చించుకు రావాలి
మాటల్ని పేర్చటం కవిత కాదు” అని ఒక అద్భుతమైన అనుభూతిని, ఉన్నతమైన ఆలోచనా స్రవంతి ని మనకి మిగులుస్తుంది ఈ పుస్తకం.

అన్ లైన్ లో కూడా చదవొచ్చు.

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

14 Responses to అమృతం కురిసిన రాత్రి

 1. త్రివిక్రమ్ అంటున్నారు:

  పుస్తక సమీక్ష చాలా బాగుందండీ! దేశనాయకుడి బొమ్మ బదులు దేవరకొండ తిలక్ ఫోటోనో, పుస్తకం అట్ట మీది బొమ్మనో, లేకపోతే ఇంకేదైనా అందమైన బొమ్మనో ఉంచితే బావుండేది కదా?

 2. రానారె అంటున్నారు:

  “ఒంటరిగా నా గదిలో నేను మేల్కుని రాసుకుంటుంటాను” అంటారు తిలక్. “నేను పాడుకొంటాను” అంటారు ఘంటసాల. కొమ్మలు పూచినట్లుగా కోయిల కూసినట్లుగా ప్రకృతి సిద్ధమైన భావవ్యక్తీకరణ అది. అందుకే వాటికి ఆ శోభ. తరించండి.

 3. srinu అంటున్నారు:

  బాగ రాసారు

 4. Chinthu అంటున్నారు:

  “భాషోద్వేగం” చాలా చక్కటి మాట! తిలక్ ను గుర్తు చేసి ఆ కమ్మటి మాటలతో మనస్సును ఆనందడోలికలో విహరింపచేసినందుకు, కనులవిందు చేసినందుకు ధన్యవాదాలు.అలాగే వీనులవిందు చేసిన “రానారె” గారికి కూడా!

 5. vbsowmya అంటున్నారు:

  manchi sameeksha, manchi pustakam gurinchi raasaaru.
  abhinandanalu.

 6. radhika అంటున్నారు:

  manchi kavitalani marala gurtu chesinanduku chala thanks andi.cadivesanu kada ani malla a pustakaanni teeyaledu.mee sameeksha chusaka malla chadavalanipistundi

 7. పింగుబ్యాకు: నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు » Blog Archive » బ్లాగుల సరస్సులో వికసించిన కల్హారం ..

 8. naga sai suri. p అంటున్నారు:

  mee bloog baavundi. ela cheyaloo naaku mail pampagalaru. neenu telugu saahitya abhimaanini. eenadu journalism school, ramoji filmcity nanda journalism cource abhyasistunnanu.naa mail pns.suri@gmail.com or pns.suri@orkut.com

  naa blog srigargeya.blogspot.com

 9. పింగుబ్యాకు: పుస్తకం » Blog Archive » నా అసమగ్ర పుస్తకాల జాబితా -4

 10. Nithin అంటున్నారు:

  సాహితీ సింధువుకి వందనం!
  శతసహస్ర భావావేశ బిందువుల్ని బయల్వెల్చిన నిర్గళ నిచ్చెలికి పాదాభివందనం!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s