మలి సందెల్లో..

sun-setorange02.jpg

ఆలయ మంటపం లో పగటి పని తో అలసిన నేను
ఆ పక్కనే ఆలస్యానికి అలిగిన కోనేరు
సాయంత్రపు గాలులతో సేద తీరాక
గల గల లు గుస గుసలు పంచుకున్నాక
నా దారిని కదిలి వెళ్ళబోతుండగా
గోధూళి కుంకుమ తో ఆహ్వానించబోయిన అవని
తలెత్తి చూడగానే
కెంజాయల్లోనో
నీలిమల్లోనో
క్రిష్ణ వర్ణాల్లోనో
అప్పటికే అలంకరించుకుని
పున్నాగ పూతల అత్తరు చల్లుతూ
చీర చెరగుతో చలి ని కదిలిస్తూ
నా దారి పొడవునా తోడుగా
మసక చీకటి చాటున సంధ్యా సుందరి.

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

6 Responses to మలి సందెల్లో..

 1. charasala అంటున్నారు:

  భలే వర్ణించారు సాయంసమయాన్ని. అది మరింత వర్ణభరితంగా వుందిప్పుడు.

  — ప్రసాద్
  http://charasala.wordpress.com

 2. బాగుంది 🙂 మసక చీకటి చాటున సంధ్యా సుందరిని చూపించారు…

 3. srinivasu అంటున్నారు:

  chala baaga vrasaru….,

 4. radhika అంటున్నారు:

  chala baagundandi mee sandya sundari.
  adbhutamaina varnana.chitram kuda bahu cakkaga vunnadi.

 5. Nagaraju అంటున్నారు:

  “చీర చెరగుతో చలి ని కదిలిస్తూ..”
  ఇది చాలా అందంగా ఉంది.
  ఎంత బాగుందంటే, ఎప్పుడో దీన్ని దొంగతనం చేసేయాలనుంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s