జాతిని కాపాడుకుందాం

అంబానాధ్ గారి ఈ వ్యాసం చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ రాస్తున్నాను.
దీనీవల్ల ఎవరినైనా అనవసరం గా బాధ పెడితే క్షమించాలి. 

                   dowry.gifఏం చేస్తాం ఇదంతా స్వయంకృతం.

వేరే దేశాల కన్నా మన దేశం లో అమ్మాయిలంటే తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారో అలోచించారా?
వాళ్ళ ఉద్దేశం లో అమ్మాయికి ఎక్కువ ఖర్చు అంటే అమ్మాయి ఎక్కువ తింటుందని కాదు అమ్మాయిలచదువుకి ఎక్కువ ఖర్చు అవుతుందని కాదు.
అసలైన కారణం కట్నం (కట్నాలు, కానుకలు, లాంచనాలు ఇతరత్రా)..
అమ్మాయిని అబ్బాయితో సమానం గా చదివించినా అమ్మాయి మంచి ఉద్యోగం చేసినా, కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యాల్సిన పరిస్థితి మాత్రం మారట్లేదు.
ఒక సౌకర్యం ఏంటంటే ఉద్యోగం ఛేసే అమ్మాయి తన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే తను సంపాదించింది మాత్రం కట్నం కోసం, బంగారం కోసం, పెళ్ళి ఖర్చుల కోసం దాచాలి.
అదే ఉద్యోగం లేని అమ్మాయైతే ఈ రొష్టంతా అప్పు చేసో, జీవితమంతా తినీ తినకా దాచో ఆ తండ్రి దౌర్భాగుడే భరించాలి.
అంతే కాదు అమ్మాయి కాపురానికి కావల్సిన వస్తువులన్ని అమ్మాయో, పుట్టింటి వాళ్ళో కొనివ్వాలి. అక్కడికి ఈ మొగుడికి దాంతో ఎమీ సంబంధం లేనట్టు.
పెళ్ళి ఇద్దరికీ సంబంధించిందే అయినా పెళ్ళి ఖర్చులకి అమ్మాయి తరఫు వాళ్ళే వీళ్ళకి డబ్బులివ్వాలి.
నా మాటలు కఠినంగా ఉన్నాయేమో తెలీదు కాని అసత్యం మాత్రం కాదు.
కానీ ఇది చదివుతున్న అబ్బాయిల్లో ఎందరు భార్య తరఫు నుంచి ఆస్థి కానీ, పెళ్ళి ఖర్చులకి డబ్బు కానీ, పెళ్ళయాక వస్తువులు కానీ, అమ్మాయి నుంచో (ఆమె సంపాదించేదైతే), ఆమె తల్లిదండ్రుల నుంచో తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నారు?
ఎంత మంది అమ్మాయిలు తమ పెళ్ళి కి తమ వైపు ఖర్చు మాత్రం కాకుండా ఇంకేమి ఖర్చు లేకుండా పెళ్ళి చేసుకున్నారో అటువంటి వారి శాతం మన సమాజం లో ఎంతుందో తెలుసుకుంటే.
స్ట్రీ భ్రూణాన్ని, స్త్రీ శిశువుని తల్లిదండ్రులు అంత నిర్దాక్షిణ్యం గా ఎలా చంపగలుగుతున్నారో అర్ధం అవుతుంది.
 

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

9 Responses to జాతిని కాపాడుకుందాం

 1. వైజాసత్య అంటున్నారు:

  స్వాతి గారు.. మీరు రాసింది చాలా వాస్తవము. కానీ కాలం మనము అనుకోనంత వేగంగా మారుతుంది అనే సంతోషకర వార్త చెప్పాలనుకుంటున్నాను. మా చెల్లి పేరు కూడా స్వాతినే. తనకు మా నాన్న కట్నమిచ్చే పెళ్లి చేశాడు. నాది మాత్రము కట్నము ఆశించని సాంప్రదేయతర వివాహమే.

 2. sudhakar అంటున్నారు:

  I think things are changing now. Many of my friends got married with out any dowry and the money spent on marriage was shared among both the parties. Ideally it should be that way and I can see many cases like that.

  The worst thing that i have seen is, gals who are earning so much also got to pay the dowry (Is that a share from them to the new family?).

  Now my question is…how many educated gals are fighting for thier share of money when properties are shared in families?

 3. cbrao అంటున్నారు:

  సమస్య తెలుపటంలో సఫలం అయ్యారు. పరిష్కారం సంగతేమిటి?

  ఆదపిల్లలకు ఆస్తిహక్కు ఉందా? వివాహ సమయంలో కొందరు ఆడపిల్లలే అబ్బాయిచేత అడిగిస్తున్నారు. అప్పుదు వీలు కాకుంటే వివాహం తర్వాత కబురు పెద్తున్నారు. ఆలస్యం ఐతే పుట్టింటి నుంచి ఇంకేమిరాదని.

 4. radhika అంటున్నారు:

  chaala manchi vyaasamu.naku ee vishayam meeda matlade hakku ledu.

 5. పింగుబ్యాకు: కన్యాశుల్కము « అమెరికానుండి ఒక ఉత్తరం ముక్క

 6. Sasikanth అంటున్నారు:

  chaala correct ga chepparu.

  Idi swayamkrutamani, maredo ani samadhana padutu taralu gadichipoyayi, ee prasnanu dasabdaluga manavallu veteestuneunnaru, ada pillau chaduvukunte samsya teerutundani chaala gattiga nammevallu. Kaani mana samajam matram enta maatram maarpu vayipu marinattu teliyatam ledu.

  We need a rethinking from the whole society,its men, as well as women. All the aspects of girl child discrimination , right from abortion of girl fetus, enequal medicare and education, extortion for dowry and unequal care for wife’s parents, all of these havent stopped since more women are getting educated.

  The discriminating practices got rooted in the newer generation as well, the new gen may listen to rock, flash the cell fones and make sms jokes, but oops they still ask for dowry.

  I am clueless abt the solution. However, thanks for the thought provking article.

 7. Srini అంటున్నారు:

  It’s true. Still, times are changing. educated once are really thinking. At the same time good girls also looking for better boys. and less fortunate girls or their fathers are trying to put more dowry for the good boys. now-a-days marriage bureus also playing some role in this. There the compitation is starting. I am not trying to put the blame on girls, since either way boys only has to take responsibility as a spouse or as a father. So, they also understand the problem, as if not today tomorrow they have to face the same music. In this fast changing world, it’s not that harsh as it used to be.

 8. కె.మహేష్ కుమార్ అంటున్నారు:

  అందరికీ తెలిసిన సమస్యే. మీరు కనీసం పరిష్కారం దిశగా కొన్ని సూచనలు చెయ్యాల్సింది. ఇన్ని బాధలు తెలిసీ,ఇన్ని కష్టాలూ పడుతున్న ఆడకూతుళ్ళది ఈ సమాజం కాదంటారా? మరి ఎవరూ ఏమీ చెయ్యరే! ఇచ్చే కట్నాన్ని అబ్బాయి తరఫు వాళ్ళు దండుకుంటే,లాంచనాలూ నగల పేర్లతో తల్లిదండ్రులను దోచుకోజూసిన కూతుర్లు (వీరు కొందరే ఐనా) నాకు తెలుసు. సమస్యకు రెండు కోణాలూ ఉన్నాయ్. ఒకటి అబ్బాయి తరఫైతే మరోటి అమ్మాయి తరఫు. అబ్బాయిలూ ఎలాగూ మారరని తెలుసుగనక, బహుశా అమ్మాయిలే మారాలేమో! నా కథ ‘సిరి కట్నలీల’ చదవగలరు.

  నేనూ మా ఆవిడా ఇద్దరి సెవింగ్స్ ఖర్చుపెట్టి,ఆర్య సమాజ్ లో పెళ్ళిచేసుకున్నాం. ఇప్పటికీ నా అంత వైభవమైన పెళ్ళి నేనెక్కడా చూడలెదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s