జాతిని కాపాడుకుందాం

మీ అందరీ అభిప్రాయలు అమూల్యమైనవే.
ఈ మధ్య కాలం లో ప్రేమ వివాహాల వల్ల, పెళ్ళికి ముందే ఏర్పడే అవగాహన వల్ల, ఇద్దరు సమాన బాధ్యత తీసుకోవటం జరుగుతుంది అమ్మాయి మీదే భారం పడకుండా(నా విషయం లో అలాగే జరిగింది).ఇది చాలా ఆశాజనకమైన పరిణామం.
కానీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో ఎక్కువ శాతం ఎదో ఒక పేరు తో అమ్మాయి వైపు వారే ఎక్కువ భారాన్ని మోస్తున్నారు.. సాంప్రదాయం వల్ల కావొచ్చు, సమాజం లో పరువు కోసం కావొచ్చు, ఇవ్వక తప్పని పరిస్థితీ కావచ్చు.
భార్యని జీవితాంతం భర్తే పోషించాల్సిన సందర్భం లో దీన్లో కొంత న్యాయం ఉందేమో కానీ, సమానం గా చదివి సమానం గా సంపాదించే వాళ్ళల్లో కుడా ఇలా జరుగుతుండటం పైనే నా బాధ.
కొందరమ్మాయిలు తామే తండ్రి నుంచి రాబట్టాలనో, అందరి ముందు గొప్పగా కనిపించాలనో ప్రయత్నించటం వాస్తవం.
ఆడపిల్ల తండ్రికి ఆస్తి ఉండి, డబ్బు ఖర్చు చెయ్యగలిగే స్థోమత ఉండి ఇదంతా వేడుక గా భావిస్తే అది వేరే విషయం కానీ పెళ్ళివారి కోరికలు తీర్చటానికి అప్పు చెయ్యటం, వాళ్ళ వృద్ధాప్యం కోసం ఏమి మిగలకుండా అమ్మాయికిచ్చెయ్యటం ఇవీ బాధాకరమైన విషయాలు.
ఏదేమైనా మన మిత్రులు చెప్పినట్టు గతం తో పోలిస్తే కొంత మార్పు ఉంది. కానీ అది పూర్తి మార్పు కాదు.
పరిష్కారం ఏమిటని అడిగారు.
1) అబ్బాయిలు ఆత్మాభిమానం తో అమ్మాయి డబ్బు తీసుకోవటం తమని తాము కించపరచుకోవటం అని భావిస్తే చాలా వరకు సమస్య తగ్గుతుంది.
మన సుభాషితాల్లో చెప్పినట్టు
తన స్వంత డబ్బు మీద ఆధారపడేవాడు ఉత్తముడు.
తండ్రి డబ్బు మీద ఆధారపడేవాడు మధ్యముడు
భార్య డబ్బు ని అనుభవించేవాడు అధముడు.
అనే సూక్తి ఇక్కడ స్మరణీయం.
2) అమ్మాయిలు గొప్పల కోసమో, పరువు కోసమో లేదా తర్వాత రాదనే భయం తోనో తండ్రి ని ఇబ్బంది పెట్టకుండా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది.

చివరగా ఒక విన్నపం: ఈ నా గోలంతా ఆడపిల్ల, అమె తల్లిదండ్రులు ఇబ్బంది పడటం గురించి అంతే కాని అమ్మాయికి చట్టపరం గా రావాల్సిన ఆస్తి హక్కు గురించో, అమ్మాయి తండ్రి కి బాగా డబ్బు ఉండి ఇష్టపూర్వకం గానో, లేదా ఒక మధ్య తరగతి భర్త చదువూ, సంపాదన లేని భార్యని పోషించాల్సిన సందర్భం లోనో నా వాదన చాల వరకు సడలుతుంది.

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

13 Responses to జాతిని కాపాడుకుందాం

 1. Sriram అంటున్నారు:

  you are correct to an extent. but the issue is a much broader one me thinks. Its not only about the costs involved in getting a girl married. the same people will not hesitate to spend extravagant amounts on their son’s education. Its much because of the system we live in. The patriarchal society that is.

  Its because taking anything from a daughter is taboo in our society. I know people who dont even prefer having food at a daughter’s place after her marriage!

  Sons are looked upon as protectors and who will take care of parents in the old age (the reality may be different, but this never sinked in)…

  To summarise in a crude way, a daughter is looked at as an investment with no ROI!

 2. swathikumari అంటున్నారు:

  Yes, True sriram.
  A valid point.
  I’ve just mentioned the monetary and practical side but ignored the sentimental and accepted social values view point.

  These beliefs are deeply rooted in our culture and society which needs to be reconsidered in the present scenario where girls are more capable of taking responsibilities par with guys.

  That again, too needs a perception change in both a daughter’s and her in-laws’ view. The feeling that once a girl is married she’s in no way related to her parants should be abondoned by herself and the family she newly enters.

  And i practically know parants feeling guilty to depend on their daughter after marriage where a guy’s parants feel it as thier right.

  A change in mindsets of people is very much required to overcome this problem.

 3. Sudhakar అంటున్నారు:

  Very valid points. The only way we can kill these things by having woman empowerment. Why should any woman be dependant on husband? and on his money. That makes a woman lenient even in the looks of her kids.

  There should be a change in parents first and then youth. Particularly men. But I have seen cases where the whole marriage expenditures are spent by boy’s party and left with nothing and there is no contrib from other party too.

  one more thing…I differ with you on boys shd feel guilty on taking money from gals. I dont be shy to ask my collegue to pay my bill if i cant. I feel, there should be no diffentiation between a boy or gal. Having this kind of egos can cause male dominanism. If a couple is going start a new life, both should be respensible for good and bad including the money required. This is the reason, why i mentioned about equal property sharing for women in India.Otherwise it will become a family of Valmiki.

 4. swathikumari అంటున్నారు:

  I think i failed to convey correctly what i think .
  I’m not against responsibilty sharing by wife and husband.
  once two persons enter into a bond it’s their common wish on deciding how to spend whose money.
  But this is a fact that in more than 90% cases girl or her parants give money to the groom for celebrating his side of the cermony and they provide all the requirements for the new family.
  What i say that a guy should feel guilty abt is not sharing property and responsibilty with his wife when they are leading a life together.
  A guy should definetely feel guilty when he’s taking money from girl for his side marriage expenses and gifts for his sisters (ఆడపడుచు లాంఛనాలు).
  A girl bringing her share to start a new family is no way wrong but bringing everything for a new family is a thing that guy should feel guilty about.
  i’m not talking theoritically
  What all i wrote were hard facts i’ve seen.

 5. Dr.Ismail అంటున్నారు:

  మీరు చెప్పిన విషయాలన్నీ చాలా వరకు నిజమైనా, భార్య మీద భర్త, భర్త మీద భార్య ఆధారపడడడం అన్నది వారి వారి జీవితాలను తీర్చిదిద్దుకొనే క్రమం లో అవసరం. ఇక నా విషయానికొస్తే కేవలం ఒక జత బట్టల్తో నా భార్యను నా జీవితంలో ఆహ్వానించినా…కానీ తర్వాత పెద్దవారి పట్టుదలల వల్ల నేను(నా కోసం కాకపోయినా) కొంత తీసుకోవాల్సివచ్చింది.
  కట్నం ఇవ్వడానికి బాధపడేవారు తీసుకొనే అవకాశం వచ్చినప్పుడు పట్టుబడతారు.ఇక ఆస్తిహక్కు లాంటి సంగతి ఎలానూ ఉంది!

 6. radhika అంటున్నారు:

  chaalaa baaga vivarincharu swati.ippati yuvata aaloochanaavidhaanam maarindi.katnam ivvamu anee ammayilu,katanam teesukomu anee abbayilu ekkuvayyaru anadaaniki chinna udaaharanee http://idontwantdowry.com/

 7. KrishnamRaju అంటున్నారు:

  Idontwantdowry.com chaala baagundi.
  Commercial element vunna social objective tho vacharu…
  Good idea..we should aprecie these guys…
  K Raju

 8. విహారి అంటున్నారు:

  పెళ్ళి లో కట్నం ఇచ్చేటప్పుడు అమ్మాయి కూడ బాధపడుతుంది.అదే అమ్మాయి కి ఆ విషయం పెళ్ళికి ఎదిగి వచ్చిన తన కొడుక్కి కట్నం తీసుకునే టప్పుడు గుర్తుకు రాదు. ఎందుకంటే కొంత మందికి ఙ్ఞాపక శక్తి తక్కువ. ఇది కొందరి విషయంలో అక్షరాలా నిజం. ఇది కూడా ర్యాగింగ్ లాంటిదే.

  జూనియర్ గా వున్నప్పుడు ర్యాగింగ్ చేశేవాళ్ళు రాక్షసులు ల్లాగ కనిపిస్తారు. అదే జూనియర్ సీనియర్ అయ్యాక ఆ విషయం గుర్తు వుండదు. చెప్పాగా ఙ్ఞాపక శక్తి తక్కువని.

  కట్నానికైనా ర్యాగింగ్ కయినా ఒకటే పరిష్కారం. నువ్వు ఆ బాధ ను అనుభవించేటప్పుడు పొందిన ఆవేదనను నీ తోనే అంతం చేసుకు. వీలయితే తిరగబడు. అంతే కానీ కోపంతో దాని మీద కసి నీ తరువాత వాళ్ళకు ప్రసాదించకు.

 9. Sudheer Kothuri అంటున్నారు:

  I agree with your perspective and the relevent explanation of its limitation.
  And your blog is extraordinarily awesome!
  Sudheer

 10. ch.swetha అంటున్నారు:

  త్వరలో కట్నం పోయి కన్యాశుల్కం వస్తుందేమో. కాని ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు (పూర్తిగా అని చెప్పలేను కాని) చాలావరకు తగ్గాయనే చెప్పవచ్చు.ఇప్పటి యువతరం ఆలొచనల్లో కొంత మార్పు అనేది గమనించవచ్చు.

  ch.swetha
  http://swetharamachandra.blogspot.com

 11. కొత్త పాళీ అంటున్నారు:

  స్వాతి గారూ,
  మీ సాహిత్యాభిరుచులూ, ఇతర అభిప్రాయాలూ నచ్చాయి.
  గూగుల్ సాహిత్యం గౄపులో అష్టపదుల పుస్తకం గురించి అడిగారు. నాకు గూగుల్ అకౌంటు లేక ఇక్కడ రాస్తున్నాను
  అజొ-విభొ వారి ఆన్ లైన్ దుకాణంలో కొన్ని పుస్తకాలు చూశాన
  http://www.avkf.org/BookLink/book_link_index.php చూడండి. ఇందులో వెతకటం కొంచెం కష్టం, ఓపిగ్గా చూడాలి.
  ఆంగ్లములో నాకు నచ్చిన పుస్తకం Love Song of the Dark Lord అని కీశే ఆచార్య బార్బరా స్టొలర్ మిల్లర్ గారు రాసింది.
  ఈ సమాచారం మీకు ఉపయోగ పడుతుందని ఆశిస్తా.

 12. Jaya Prakash అంటున్నారు:

  స్వాతి గారు, మంచిగ రాస్తున్నరు. ఎన్నో సార్లు స్త్రీలు (ఇంటా, బయటా) ఎదుర్కుంటున్న సమస్యల గురించి రాయలనిపిచ్చింది. కాని ఒక నేను ఒక మగవాడిగా విషయాలు Rational గా రాయగలనో లెదో, న్యాయం చెయ్యగలనో లేదో, అని ధైర్యం చెయ్యలేక పోయిన.
  ఇవ్వాల మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నా, నేటి స్త్రీలకు మాత్రం రాతియుగం నాటి Patriarchic rules ఏ వర్తిస్తున్నందుకు బాధ పడాలా, సిగ్గు పడాల అర్థం కాదు. ఎంత దూరం వచ్చి ఏ అమెరికాల ఉన్నా, ఎంత సంపాదించినా, సొంత భార్యని second class citizens లాగ చూసే భర్తలను ఏం చెయ్యలో అర్థం కాదు (…మీరు మీ భార్యలకు తగిన గౌరవం ఇచ్చే వాలైతే మీకిది వర్తించదనుకోండి  )

  నీతో సమానంగ చదివి, అంతే అల్లారు ముద్దుగ పెరిగి, నీ అంతే సంపాదించినా నీ స్థానం నా కాలి కిందే / వంటింట్లో నే.. అనే attitude నేటి chauvinistic మగవాల్లు మార్చుకోవాలె . స్త్రీలకు సమానమైన గౌరవం ఇవ్వలేని వాడు ఆ స్త్రీ తో (మరి ఏ స్త్రీ తోటి గూడా..) సహచర్యం చెయ్యడానికి అర్హుడు కాడు.

  మీరు ఇలానే, స్త్రీల విషయాలపై రాస్తుండండి. మీలా ఇంకా చలామంది ముండుకు రావలి. అంతే కాకుండా, ఇలాంటి సమస్యలతో నలుగుతున్న ఆడవారికి సరైన counseling, moral support ఇవ్వలె.
  స్త్రీల సమస్యలపై వస్తున్న ఈ సైట్ http://bhumika.org అందుకు ఇంకా సహకరిస్తుందనుకుంట..

  _ ప్రకాశ్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s