అంతర్వాహిని

        lady-body-scrub.jpg

కోడి కూత కి వేకువ కి నడుమ కల నుండి మెలకువగా మారిన నీ జ్ఞాపకం
నీహారిక నెమ్మదించేవరకు ఆహ్లాదంగా కదిలి
జడ వేసుకుంటూ, మెట్లు దిగుతూ, రోడ్డు మీద నడుస్తూ ఉండగా హడావిడిగా పరుగిడి
అపరాహ్ణాన ఇత్తడి చెంబు నీట మునగ్గానే వేప చెట్టు పైన వడ్రంగి పిట్ట చప్పుడు ఆగినప్పుడు అలసటగా ఒదిగి
సాయం సమీరాల్లో వాలు కుర్ఛీ లో ప్రతి పేజీ కి పాట కి మధ్య విరామం గా
నడిరేయి కనుల క్షేత్రం లో నిద్ర కి నీటి కి జరిగే యుద్ధం లో మరిన్ని గాయాలు మిగిల్చి…
చీకట్లో తోడు గా ఉండే నీ జ్ఞాపకం.

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

13 Responses to అంతర్వాహిని

 1. radhika అంటున్నారు:

  కొద్ది గా మాత్రమే అర్దమయిన భావం… కానీ గొప్ప కవిత చదివిన అనుభూతి…ఏమిటి మీ కవితలో ఈ మహత్యం.

 2. Prasad Charasala అంటున్నారు:

  పూర్తిగా అర్థం కాలేదు.
  తెల్లవారుఝామున వచ్చే కలల గురించా?
  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. కిరణ్ కముజు అంటున్నారు:

  ఉనికి లో ఉన్న జ్ఞాపకం కలలోకి వచ్చిందా లేక అప్పుడే కలలో పుట్టిందా!
  లేదు మొదటిదే అయి ఉంటుంది.
  ‘కనుల క్షేత్రం లో నిద్ర కి నీటి కి జరిగే యుద్ధం లో’
  చాలా అద్భుతంగా రాశారు.

 4. swathi అంటున్నారు:

  ఇది నేను కొంఛం అబ్సర్డ్ గా రాసినట్టున్నాను. ఏదేమైనా మీకు అర్ధమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

  ఒక ప్రేమలోనో, విరహం లోనో, దాని వల్ల కలిగిన విషాదం లోనో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా అవే తలపులు మనసులో ఎదో ఒక మూలన కదలాడుతూనే ఉంటాయి.
  రాత్రి నిద్ర లో కలాలా వచ్చి ఉదయం అదే కలని అలోచన గా కొనసాగిస్తూ మేల్కొంటాం.
  ఉదయం దాదాపు అలోచనలు ఆహ్లాదం గానే ఉంటాయి.
  తర్వాత పనిలో పడినప్పుడు అంత హడావిడి లోనూ అప్పుడప్పుడు తలపులు కలుగుతూ ఉండటం..
  అలసట గా ఉన్నప్పుడు ఆ విషాదం తాలుకు బాధ కొద్దిగా ఆ అలసట కి తోడవుతుంది.
  ఛదువుకుంటున్నా, పాటలు వింటున్నా వదలవు..
  ఇక చివరికి శారిరకమైనా, మానసికమైనా ఏ బాధైనా రాత్రి పూటే ఉధృతం గా ఉంటుంది.
  నిద్ర పోబోయే ముందో, నిద్ర మధ్యలో మెలకువ వచ్చో, ఆ సమయం లో ఉండే నిశ్శబ్ధం వల్ల పూర్తి ఏకాంతం చిక్కటం వల్లా ఒక nostalgic feeling వల్ల విపరీతమైన కన్నీళ్ళు వస్తూ ఉంటాయి.

 5. Sudheer Kothuri అంటున్నారు:

  బావుంది! మీరు చాలా బాగా వ్రాస్తారు!

 6. Prasad Charasala అంటున్నారు:

  మీ వివరణ తో మళ్ళీ చదివితే మీ కవిత మరింత అందంగా శోభిళ్ళింది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 7. radhika అంటున్నారు:

  మీరు కవిత రాయడం ఏమిటో గానీ నిన్నటి నుండి మీ కవితలో చెప్పినట్టు గా నాకు జరుగుతుంది.అలా వెంటాడేది జ్ఞాపకం కాదు….మీ ఈ కవితే

 8. Nagaraju అంటున్నారు:

  చాల చక్కటి అనుభూతి కవిత.ఈ కవితని నేను రాస్తున్న వాస్యంలో ఉదాహరించి, వివరించొచ్చా? అలాగే కొన్ని మార్పులు సూచించవచ్చా?
  — నాగరాజు.

 9. కొత్త పాళీ అంటున్నారు:

  Beautiful.
  కనుల క్షేత్రంలో నిద్రకీ నీటికీ మధ్య యుద్ధం ..
  fantastic!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s