మురళీ రవళి

        krishna.jpg

మధువులొలకవేమిరా మధుసూధనా
మధురాపురి ముదమందగ యదునందనా

యమున యదలో ఎప్పుడో జలపాతమై
కరిగి వీనుల విందులో నవనీతమై

వెదురు గుండెకు గానమూదిన పవనమేమో మోహనం
రాగ సుధాలాపనలో ప్రతి పయనం సమ్మోహనం                                     

సందెల సందిట అందమే బృందావనిగా
నీ అందెల అలికిడికే పులకించిన అవనిగా

ఆ భావమే భూపాలమై లేచె మధురిమలే
నిశి మలుపులో ఆ పిలుపుకై వేచే అరుణిమలే

మధువులొలకవేమిరా మధుసూధనా

– స్వాతి

* “రేపల్లియ యదఝల్లున” స్పూర్తితో  కొన్నేళ్ళ కిందట రాసుకున్నది.
దీన్ని ఎవరైనా ట్యూన్ చేస్తే వినాలని ఉంది.

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

7 Responses to మురళీ రవళి

 1. Sriram అంటున్నారు:

  aaaha…
  deenini chakkati raagamaalikagaa tune cheyyachchu…i will suggest madhuvanthi, yamuna kalyani, brindavana saranga, mohana and bhupalam… 🙂

 2. radhika అంటున్నారు:

  ఈ కవితలో పదాల అల్లిక చాలా బాగుంది.పాటకి సరిగ్గా సరిపోతుంది

 3. రానారె అంటున్నారు:

  తొలిసంధ్యవేళలో తొలిపొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగంకదూ భూపాలం!
  మధురిమల నిదురలేపేందుకు ఆ భావం భూపాలరాగమయిందనడం – నాకు చాలా నచ్చింది.
  శాస్త్రీయసంగీతమంటే ఆసక్తివుందిగానీ నాకు తెలిసింది సున్న.

 4. Prasad Charasala అంటున్నారు:

  పాట చాలా బాగుంది. మీరన్నట్లు ఎవరైనా త్యూన్ ఇస్తే గానీ మధ్రం తెలిసిరాదు.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. Brahmam అంటున్నారు:

  really nice, i like it and i will try to tune it.

 6. Brahmam అంటున్నారు:

  really nice. I like it and I will try to tune it.

 7. కొత్త పాళీ అంటున్నారు:

  పాట బానే వుంది అలవోకగా చూస్తే

  కానీ ప్రతి చరణం పల్లవితో కలిపి చదువుకుంటే అన్వయింపు నాకు కుదరటం లేదు.
  నా వుద్దేశంలో ఇలా ఒక సంపూర్ణ వాక్యం లాగా అన్వయం కుదరాలి పాటలో.

  ఒక సవరింపు – మధుసూదన – సరైన మాట లో రెండో “ద” కి వొత్తు లేదు.
  అంటే మధు అనే రాక్షసుణ్ణి చంపినవాడా అని.
  ‘జనార్ధన” అని కూడా అంటారు జనం విరివిగా, దీంట్లో కూడా ద కి వొత్తు లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s