వాళ్ళ కోసమే..

comingsoonsml1.jpg

నెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి

మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.

పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి
మనం నిజంగా వాళ్ళ కోసమేనా సంపాదిస్తున్నాం?

* Nothing else in this world can be better than a non-working mother అని ఎక్కడో చదివాను. నిజమేనేమో!!

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

19 Responses to వాళ్ళ కోసమే..

 1. vihaari అంటున్నారు:

  చాల చక్కగా చెప్పారు.

  ఇలాంటి వాటి మీదనే ఇక్కడ “ఏం మేము పిల్లల్ని సరీగా చూడట్లేదా” అని చిన్న సైజు యుద్ధం జరిగింది.

  విహారి
  http://vihaari.blogspot.com

 2. swetha అంటున్నారు:

  “Nothing else in this world can be better than a non-working mother” అనేది చాలా నిజం అని నేను నమ్ముతాను. నేను కూడా ప్రస్తుతానికి వొర్కింగ్ ఉమెన్ (ఇంకా పిల్లలు లేరు కాబట్టి).నాకు మాత్రం నాపిల్లల బాల్యాన్ని దోచేసి,ఉదయపు లేత నిద్రని చెరిచేసి,ప్లే స్కూల్ పాలు చెయ్యడం,పిల్లల్ని దగ్గరుండి పెంచే ఆనందాన్ని వాళ్ళకోసమే సంపాదిస్తున్నాము అన్న వంకతో దూరం చేసుకోవడం ఇష్టం లేదు. నేను మాత్రం వర్కింగ్ మదర్ ని కాకూడదని నిర్ణయించుకున్నాను.

 3. Janakiram అంటున్నారు:

  Very good thought! I really respect women who think this way!

 4. మీ సమాధానం చూసేలోపే వెళ్లిపోయాను.మళ్లీ చూసాను, సారీ!.మీరు చెప్పింది నిజమే అయినా… మనమెంత శ్రమపడ్డా చివరికి పిల్లల కోసమేగా ఇదంతా.ఏది దూరం చేసినా వారి బాల్యాన్ని మాత్రం వారికివ్వాలి. ఇప్పుడెంతగా అర్రులు చాచినా మనకు అందని స్వర్గం అదేగా!

 5. శోధన అంటున్నారు:

  అందుకే ఇలా అన్నారు సినారె

  ఉందో లేదో స్వర్గం, నా పుణ్యం నాకిచ్చేయ్
  ఉందో లేదో పుణ్యం, నా బాల్యం నాకిచ్చేయ్

 6. Nagaraju Pappu అంటున్నారు:

  మీ గుండె కోత నేనర్ధం చేసుకోగలను. అయితే, ఇక్కడ రెండు వేరు వేరు విషయాలున్నాయి.
  ౧. పిల్లల బాల్యం, పెంపకం గురించి

  ౨. భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ, అందులోను పని ఒత్తిడి ఎక్కువ ఉండే ఉద్యోగాలు చేయ్యవలసి రావటం. ముఖ్యంగా స్త్రీలమీద ఈ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం.

  రెంటినీ వేరు వేరుగా చూస్తేనే కాని, ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. మన దేశంలో – ఇప్పుడు ఈ పరిస్తితి మరీ తీవ్రంగా ఉంది. చాల మంది ఈ విషయంలో పని చేస్తున్నారు. నాకు తెలిసిన కొన్ని సూచనలు (పరిష్కారాలు కావనుకోండి):

  ౧. ఈ నాటి ప్రపంచంలో డబ్బుకోసం కాకపోయినా, మనుగడ కోసమైనా స్త్రీలు ఉద్యోగం చెయ్యాలి కదా? స్వాతంత్రం మన జన్మ హక్కైనప్పటికీ, అది లభించేది ఆర్ధిక స్వాతంత్రం ఉన్నప్పుడే కదా?

  ౨. అదీ కాకుండా, స్త్రీలు సమాజంలో గాని, రాజకీయాల్లో కాని, బిజినెస్ ప్రపంచంలో కాని, మరేదైనా విషయంలో కాని క్రియాశీలక పాత్రలు పోషించటం ఈ రోజు, మానవాళి మనుగడకే చాలా అవసరం.

  ౩. అయితే, ఈ రోజుల్లో చెయ్యడానికి, చాలా రకాల ఎవెన్యూలున్నాయి. పార్ట్-టైమ్ ఉద్యోగాలు చెయ్యొచ్చు, ఫ్రీ-లన్సింగ్ చెయ్యొచ్చు, కన్సల్టింగ్ చెయ్యొచ్చు. కాకపోతే, సొంతగా ఎదైనా బిజినెస్ చెయ్యొచ్చు. ఇంటర్-నెట్ వచ్చేక, ప్రపంచం చాలా చిన్నదైపోయింది, ఎంత చిన్నదైపోయందంటే – ఉసిరికాయంత (అంటే, కరతలా మలకం అయ్యింది). దీని పర్యవశాలు అర్ధం చేసుకోవటం చాలా అవసరం ప్రతి ఒక్కరికీ. ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, మన జీవితాలని మనకి కావలిసినట్టు తీర్చి దిద్దుకోవచ్చు. ఉదాహరణకి, ఈబే లాంటి వాటినుపయోగించుకొని, చక్కటి వ్యాపారం చెయ్యొచ్చు. అలాగే, చాలా ఫ్రీలాన్సింగ్ సైట్లు కూడా ఉన్నాయి. ఇంట్లో కూర్చునే మీరు చాలా పని చేసుకోవచ్చు. అలాగే, ఈ సౌకర్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలితే, మీరు పెద్ద పెద్ద నగరాల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరులోనో, తెనాలిలోనే ఉంటూనే, ఒక వారమో, రెండు వారాలో పెద్దనగరాలకి వస్తే సరిపోతుంది. కొన్ని సంధర్భాల్లొ అది కూడా అవసరం లేదు.

  ౪. నాకు తెలిసి, చాల మంది తెలివైన భార్యా భర్తలు ఇప్పుడు పళ్ళైన వెంటనే పిల్లల్ని కనటం లేదు. కొంత ఆర్దిక స్వాతంత్రం వచ్చేక, అంటే, ఒక ఇల్లు, కొన్ని ఇన్-వెస్ట్-మెంట్లు చేసుకొన్నాక, ఫుల్-టైమ్ ఉద్యోగం ఒకరు మానేసే ఆలోచనలో ఉన్నారు. అది భార్య కావొచ్చు, భర్త కావొచ్చు, లేదా ఇద్దరూ కావిచ్చు.

  ౬. ఇక పిల్లల పెంపకం, బాల్యం విషయానికొస్తే, ఇంగ్లీషు లో ఒక సామెతుంది: It takes a village to bring up a child. అంటే, పిల్లలని పెంచడం అనేది కేవలం – కుటుంబ విషయం కాదు, సంఘం మెత్తానికి సంభందించిన విషయం. ఉదాహరణకి, బెంగుళూరులో మేము కొంత మంది చేరి – పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొంటాం – కొంతమంది కథలు చెప్తారు పిల్లలని కూచోపెట్టుకొని, కొంత మంది వాళ్లలో సృజనాత్మకతని పెంపొందించే విషయంలో శ్రధ్ద తీసుకొంటారు. కొంత మంది కాప్లిమెంటరీ ఎడ్యుకేషన్ లో శ్రధ్ద తీసుకొంటారు. కొంత మంది ఆట పాటల్లో – ఇలా. ఈ రకంగా, పిల్లలు కోల్పోయేదీ ఉండదు. ఉదాహరణకి, నేను కథలు కొంత మంది పిల్లలకి కథలు చెప్తాను. కాంప్లిమెంటరీ ఎడ్యుకేషన్ లో పని చేస్తాను – హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనుకోండి.
  ౭. ఇంక వర్క్-లైఫ్-బేలన్సుకి సంభందించి చాలా కోర్సులూ, పుస్తకాలూ ఉన్నాయి. మీకు కావాలంటే, నాకు ఈమైల్ చెయ్యండి, వీలు చూసుకొని, మీకు ఆ సమచారమంతా పంపిస్తాను.

 7. సింధు అంటున్నారు:

  ఒక్కసారిగా బాల్యం గుర్తు వచ్చింది. లేవకూడదనిపించినా అమ్మ నిద్ర లేపి ట్యూషంకి పంపించాలని అమ్మ ఆత్రం. నిద్ర లెవకపొతే భవిష్యత్తు అంతా పాడయిపోతోందని భయపడి పయపెట్టే నాన్న.అంత మాత్రాన Non-Working mother అయినంత మాత్రాన అందరూ పిల్లల్ని చిన్నబుచ్చుకోకుండా, చూసుకోగలరని చెప్పలేం.నన్ను “బుడిగి” అంటారు ఇంట్లో వాల్లందరూ.దానికి బదులు ముళ్ళపూడి గారి బుడుగును అయ్యి ఉంటే బాగుండు అనిపిస్తుంది..

 8. ప్రసాద్ అంటున్నారు:

  ఇది మీ వాడి ఫోటోనా?
  మీరేసిన ప్రశ్న ఇంచుమించు ప్రతి తల్లి, తండ్రీలోనూ కలుగుతూ వుంటుంది. విదేశాల్లో వున్న మాకైతే దీనికి తోడు “మన వాళ్ళను, మన భూమిని, మన సంసృతి సంప్రదాయాలను వదిలేసి వీటికి దూరంగా ఇక్కడ పిల్లలను పెంచాల్సిన అవసరం వుందా అనిపిస్తుంది.”
  ఒకటి కావాలంటే ఒకటి కోల్పోక తప్పదు. స్త్రీ తల్లిగానూ, ఆర్జనాపరురాలు గానూ వుండాలంటే ఏదో ఒకదానికి అన్యాయం జరగక తప్పదు. అందుకేనేమొ మన పెద్దలు స్త్రీ, పురుష విధులను స్పష్టంగా విభజించింది. ఇప్పుడు స్త్రీ కొత్తగా ఎత్తుకుంటున్న బాద్యతలతో, సహజసిద్దమైన బాద్యతలకు విఘాతం కలుగుతున్నట్లుంది.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 9. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  నాగరాజు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
  ఆడవారు పని చెయ్యడం, ఆర్థిక స్వాతంత్రం సాధించడం చాలా అవసరం. కానీ పిల్లలకు వారి బాల్యం దూరం చెయ్యడం కూడా శోచనీయమే. దీనికి పరిష్కారం హద్దులు ఎక్కడో తెలుసుకోవడమే. ఒక్కోసారి మన మంచి కోసం కొన్ని త్యాగం చెయ్యాల్సి రావచ్చు. అది సరిగా గ్రహిస్తే అంతే చాలు.

 10. radhika అంటున్నారు:

  డబ్బు సంపాదనలో పడి మనం మన పిల్లల బాల్యాన్నే కాదు మన తల్లిదండ్రుల ఆనందాన్ని,భవిష్యత్తునూ కూడా దోచేస్తున్నాము.
  కవితలో ఆర్ద్రత ఎంతున్నాదని కాదు ఎంత ఆలోచింపచేస్తుందన్నదానినిబట్టి కవిత గొప్పదనం వుంటుంది.ఆ గొప్పదనం మీ ఈ కవితలో వుంది. మీ అభిమానుల లిస్ట్ లో నన్ను మొదట చేర్చుకోండి.

 11. Jabalimuni అంటున్నారు:

  వృక్షాలు,జంతువులు తమ జాతిని వుద్ధరించడానికి తమ లింగ తారతమ్యతను గుర్తించి వాటి వాటి విధులను నిర్వర్తిస్తున్నాయి.కీటకాలు కూడా స్త్రీ కీటకం చెయ్యవలసి పని స్త్రీలే చేస్తాయి.పురుష కీటకాలు వాటి పనే అవి చేస్తాయి.కాని మానవ జాతి యీ విషయం విస్మరించి చాల బాధలకు గురి అవుతున్నాది.
  జాబాలిముని

 12. lalitha అంటున్నారు:

  ఇంట్లో ఉండే తల్లి మాత్రమే ఉత్తమమైన తల్లి అనేది సమర్థనీయం కాదు.
  నిజానికి పిల్లలు పుట్టాక ఉద్యోగం చేయడమా వద్దా అని
  ఎంచుకో గలిగే అవకాశం ఉండ గలగాలి అందరికీ అనిపిస్తుంది .

  ఎంతో మందికి ఈ అవకాశం ఉండదు.
  ఆర్థిక అవసరాల కోసం తప్పని సరిగా ఉద్యోగం
  చెయ్యవల్సిన వారు చాలా మంది ఉంటారు.

  ఇంకొక సమస్య అంత పెద్దది కాక పోయినా, పెద్ద్దగా అనిపించకపోయినా,
  నాణానికి అవతల వైపు చూస్తే ఉత్సాహం ఉండీ ఇంట్లోనే ఉండీ పోవల్సి
  వచ్చే వారు కొందరు ఉంటారు. అలా ఉండిపో వలసి వచ్చినప్పుడు
  ఆ తల్లిలో మానసికంగా అశాంతి పెరుగుతుంది. అదిఇంట్లో వారిని
  అందరినీ బాధ పెడుతుంది.

  నాగ రాజు గారు అన్నట్లు, పిల్లలని పెంచండం తల్లి ఒక్క దాని బాధ్యతే
  కాదు. అది ఒక్కటే ఆడదాని మొత్తం బాధ్యతా, జీవితమూ కాదు.

  భార్యా భర్తలిద్దరూ కలిసి మంచి చెడులు బేరీజు వేసుకొని చూసుకొని
  అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నిర్ణయాలు తీసుకొని దానికి
  తగ్గట్టు మిగిలిన ఏర్పాట్లు చేసుకోవాలి.

  అలాగే రాధిక గారు అన్నట్లు పిల్లలే కాదు, మన తల్లి దండ్రుల /
  అత్త మామల అనందాలు, అవసరాలు కూడా మనం తీసుకొనే నిర్ణయాల
  మీద అధార పడతాయి, ప్రభావితం చేస్తాయి కూడ.

  ఇది నా అభిప్రాయం.

 13. Sudhakar అంటున్నారు:

  Chala baga rasarandi. Hats off to you!!!

 14. కిషోరు అంటున్నారు:

  ఆహా! చాలా రోజులకి ఒక మంచి టపా చదివాను అన్న అనుభూతి కలిగింది.

 15. chandu అంటున్నారు:

  bagundi
  pillala balyanni dooramchese parents eppudu marataro……??
  idi dabbu meeda moju
  dabbu potundi elaa poyindo alage vastundi kani blayam tirigi vastunda tirigi ivvagalara
  alochinchali

 16. bollojubaba అంటున్నారు:

  మీ కవిత దానికి స్పందనలు చూసాను

  నా భార్య మా హోం మేకర్. ఒక్కోసారి మాకే అనిపిస్తుంది. ఇంకో చెయ్యి కూడా ఉంటే పిల్లలకు ఇంకొంచెం మంచి బట్టలు కొనచ్చుకదా, ఇంకొంచెం పెద్దస్కూల్ లో చదివించొచ్చుకదా, ఇంకొంచెం ఖరీదైన వినోదాన్నివ్వచ్చు కదా, ఇంకొంచెం విలువైన వస్తువులను సమకూర్చగలం కదా అని. కానీ వీటన్నిటిని అతీతమైన తృప్తిని పొందుతున్నామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. బహుసా అలా అనుకోక పోతే సంతోషంగా బతకలేమేమో?

  అద్దంలో చూసుకుంటే మనమొటిమలు మనకు పెద్దవిగా కనిపించినట్లు మనంతప్ప మిగిలినవాళ్లందరూ ఎక్కువ సుఖపడిపోతున్నారనుకోవటం ఈ సృష్టి చమత్కారమేమో?

  బొల్లోజు బాబా

 17. సతీష్ యనమండ్ర అంటున్నారు:

  నమస్కారం స్వాతి గారు, బాబు పుట్టినట్టు చదివాను మీ పునరపి ప్రణయం లో. మేనల్లుడు ఎలా వున్నాడు? మీ బ్లాగ్ ని ఇవాళే చూసాను. చాలా బాగుంది. తెలుగు కవిత్వానికి పెద్ద పీట వేసిన మీరు అభినందనీయులు. నేను కూడా ఒక చిరు ప్రయత్నం మొదలు పెట్టాను. నా బ్లాగ్ ని నన్నూ ఆశీర్వదించండి. వీలయితే మీ అమూల్యమైన సలహాలను తెలియబరచండి. ప్రస్తుతం నేను కూడా పుత్రికోత్సాహం లో వున్నాను ( నా బ్లాగ్ ఇప్పుడు నాకు కూతురు అయిపొయింది ).

  ఇలా ఇంక మంచి మంచి కవితలు వ్రాస్తూ వుండండి.

  వుంటా మరి,

  మీ ఈ – తమ్ముడు

  సతీష్ యనమండ్ర

 18. కె.మహేష్ కుమార్ అంటున్నారు:

  మా ఆవిడ మావాడికోసం ఉద్యోగం మానేసింది. తను ఉద్యోగం మానేసే సమయానికి నాకొచ్చే జీతంకన్నా తన జీతమే ఎక్కువ. కానీ మానేసింది. ఆ సమయంలో తను చెప్పిన సమాధానం “I have a bigger and better job to attend to” అని. ప్రస్తుతం అవినాష్ బాధ్యతతోపాటూ ఇల్లూ, నా అర్థిక ప్లానింగ్ అన్నీ తనే చూసుకుంటుంది.

  ఇలాంటి నిర్ణయాలు పూర్తిగా ధృక్కోణానికి సంబంధించిన విషయాలుగా అనిపిస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s