లావణ్య కౌముది

kum1.jpg

నిండు జాబిలి కి తోడు మరో చందమామా?
శశి వదనా! నీ మోవి పై అవి నవ్వుల నెలవంకలా

అసలే సిరులు.. చుట్టూ ముత్యాల హారాలా?
లేక కురుల వనం లో మరుమల్లె సరాలా

జ్యోతి శిఖల నడుమ  కృష్ణ వర్ణాలా?
మెరుపు కళ్ళలో నల్లటి కనుపాపల మైమరపులా

పసిడి పోత కి హరితపు పూతలా?
హేమలతా!  నీవు కదిలితే పచ్చని గాజుల మోతలా!

* కౌముది పత్రిక పై ముఖ చిత్రాన్ని చూసి.

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

15 Responses to లావణ్య కౌముది

 1. radhika అంటున్నారు:

  నిజం చెప్పొద్దూ …పొద్దులో మీ మొదటి ఫొటో కొద్దిగా ఇలానే వుంది.జ్యోతి శిఖల నడుమ క్రిష్న వర్ణాలా అని ఏ ఉద్దేస్యం లో రాసారు?నేను అనుకోవడం కనుల మధ్య నల్లని కనుపాపలని.అది కాదేమొ అని కూడా గట్టి ఫీలింగ్.ఎందుకంటే ఈ వాక్యాలకు క్రిందే మెరుపుకళ్ళలో అంటూ రాసారుగా.

 2. కొత్త పాళీ అంటున్నారు:

  రాధికా, మీరు మొదట అనుకున్నదే కరక్టు.
  మిగతా పద్యం అంతా పరిశీలించండి. ప్రతి ద్విపదలోనూ మొదటి పాదం ఒక అలౌకికమైన అందాన్ని చెప్పి రెండో పాదంలో ఆ అందం ఈ బొమ్మలోని స్త్రీలో ఎక్కడుందో చెబుతోంది.
  స్వాతిగారూ, బావుంది పద్యం. అన్నట్టు మీరు మా “మీకిష్టమైన సీసపద్యం” సర్వేలో పాల్గోరూ?

 3. Sriram అంటున్నారు:

  ఆహా ఏమి అందం…ఏమి అందం!
  నేనన్నది మీ కవిత గురించే…నిఝ్ఝం!

  🙂

 4. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  ఆహా… ఎంతందంగా చిత్రించాడండీ చిత్రకారుడు.
  మీ కవిత దానికి ఇంకా అందాన్నిచ్చింది.

 5. anjali అంటున్నారు:

  chala bagundi

  anjali

 6. రానారె అంటున్నారు:

  బ్రహ్మాండం.
  కవులు, కవయిత్రులు ఇద్దరూ ఆడవారిని అందంగా వర్ణిస్తారు. అలా వర్ణించడం సాధారణంగా పరిగణింపబడుతుంది కూడా. మగవాణ్ణి గురించి కవయిత్రులు వర్ణించడం కూడా కద్దు. అదే ఒక మగవాణ్ణి గురించి కవి వర్ణించాడంటే, నాకు తెలిసినంతవరకూ, ఆ మగవాడెవడో మహాపురుషుడో దైవాశసంభూతుడో అయివుంటాడే గానీ సాధారణ మానవుడు అయుండడు. కాదంటారా?

 7. swathi అంటున్నారు:

  “అభిజ్నాన” శాకుంతలం లో కాళిదాసు దుష్యంతుణ్ణి వర్ణిచినట్టు గుర్తు. ఒసారి చూడండి.
  పొతన గారు రాముడినీ, క్రిష్ణుడిని కూడా వదిలి ఉండరే!!

 8. కొత్త పాళీ అంటున్నారు:

  సాహిత్యంలో పురుషాహంకార భావజాలానికి ఈ వర్ణనల్లో భేదం ఒక ఉదాహరణ అని ఫెమినిస్టు సిద్ధాంతులు అంటారు. అన్నమయ్య అలమేలు మంగ అంగాంగ వర్ణన చేసినట్టు తనకూ శ్రీనివాసుడి ప్రత్యవయవ వర్ణన చెయ్యాలని ఉంది కానీ దానికి ఎక్కడా మార్గదర్శులు లేరే అని ప్రముఖ ఫెమినిస్టు కవయిత్రి జయప్రభ వాపోయారు ఒక వ్యాసంలో.
  మగవారి వర్ణనలు జరిగాయి – లేక కాదు. అందులోనూ, నాకు తెలిసినంతలో రానారె గమనిక కరక్టే – వర్ణింపబడినది మహాపురుషులే – వర్ణించేది మహా భక్తులే. రుక్మిణీ కళ్యాణంలో కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకు పోవటానికి రథం మీద వేచి ఉండగా రుక్మిణి ఆయన్ను చూసిన దృశ్యం – “కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ ..” అని male oomphకి ఒక మంచి ఉదాహరణ. దీన్ని శ్రీకృష్ణపాండవీయంలో NTR మీద చాలా tastefulగా చిత్రీకరించారు కూడా. ఇక త్యాగయ్య అనేక కీర్తనల్లో రాముడి అందాన్ని పదే పదే పొగిడాడు – ఎంత అంటే ఈ కాలంలో ఈ దేశంలో అలాంటి పొయెట్రీ ప్రచురిస్తే దాన్ని గే లవ్ అనుకో గలరు. ఊరికే పొగడ్డం కాదు .. ఆ పొగిడే కృతుల్లో ఒక తన్మయత్వం కనిపిస్తుంది, మిగతా కృతుల్లో లేనిది.

 9. రానారె అంటున్నారు:

  రఘూ రాముడూ
  రమణీయ వినీల ఘన శ్యాముడూ
  వాడు-నెలఱేడు-సరిజోడు-మొనగాడు
  వాని తనువు మగనీలమేలురా – వాని నగవు రతనాలజాలు రా
  వాని జూచి మగవారలైన మరుల్గొనెడు మరో మరుడు మనోహరుడు “రఘూ రాముడూ…”

  ఇది వాగ్దానం సినిమాకోసం ఘంటసాలపాడిన శ్రీశ్రీ రచన (శివధనుర్భంగం హరికథలో ఒక భాగం – శ్రీనగజా తనయం – అంటూ ప్రారంభమౌతుంది). త్యాగరాయని తన్మయత్వం గురించిన కొత్తపాళీగారి ప్రస్తావనతో ఇది గుర్తొచ్చింది. ఇంటర్నెట్లో దొరకలేదీ పాట. తీరిగ్గా వెదికి చూడాలి.

 10. పింగుబ్యాకు: అందమైన సమస్య! « సంగతులూ,సందర్భాలూ….

 11. kamesh అంటున్నారు:

  @రానారె. మీరీపాటను http://kamesh.wordpress.com నుండి కాని http://chittellas.hlogspot.com నుండి వినవచ్చు. దిగుమతి చేసుకోవచ్చు.

 12. subrahmanyam అంటున్నారు:

  ఏ మాత్రం కొత్తదనం లేదు. కవితలన్నీ ఒక స్థాయిలో ఉండేలా జాగ్రత్తపడడం అవసరం.

 13. ramesh అంటున్నారు:

  ayybaboooy

  image matram suparandi

  nojanga chitrakarudi kunche andam atadhi bommalo kanipistondi

 14. రసజ్ఞ అంటున్నారు:

  ఆ చిత్రానికి మీ వర్ణన మరింత వన్నె తెచ్చింది. అత్యద్భుతంగా ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s