మా ఊర్లో నిన్న వర్షం

img_6320_small.jpg
సాయంత్రం…టైం ఏడని కంప్యూటర్ లో కనిపిస్తుంది కాబట్టి,

తేడా తెలీదు చుట్టూ లైట్లు నిరంతరాయం గా వెలుగుతూ ఉంటాయి కాబట్టి.

ఏదో మెయిల్..
clickk..
meeting..
agenda..
document..
..ok fine
close.
కీ బోర్డ్ టక టక.. ఇంటర్ కమ్ గణగణ..అటు ఇటు మనుషులు చక చక..

ఒక pop up మెస్సేజ్..Heyy!! it’s raining outside.
“ఓహ్! అవునా”
ఇక్కడేం కనపడదే! కాఫీ రూమ్ కెళ్తే సరి..
ఆ! అన్ని వైపులనుంచి గది అద్దాల మీద ఎడా పెడా జల్లు , గట్టిగా తగిలి వెంటనే జారి పోతూ.. అద్దాలు శుభ్రం, చూపుకి అస్పష్టత..

Back to seat

కొద్దిగా సంగీతం?
Why not.. వెంటనే  సమాధానం.
బయట వాన జోరు, చెవుల్లో  ఉన్ని క్రిష్ణన్ శాస్త్రీయ హోరు, సగం సిప్ చేసిన కాఫీ కప్, కీ బోర్డ్ మీద ముని వేళ్ళ అనంద తాండవం..
వెరసి తెలుగులో ఒక ఈ-లేఖ.

what’s next?
hello! hello! పక్కన టీం మేట్ గొడవ,
ఉన్ని క్రిష్ణన్ కి చిన్న అంతరాయం ..తనకి సమాధానం చిన్న నవ్వు తో పాటు..
“ఏమిటీ హుషారు”? తన ప్రశ్న
– “nothing! వాన కదా”మళ్ళీ నవ్వు.
“హా అదా సరే enjoy” ఆమె నిష్క్రమణం.

సంగీతం మళ్ళీ..ఈ సారి పని తో బాటు..
రోజూ ఉండే పనులే సంగతులే .. కొత్త ఉత్సాహం తో.
ఓ అరగంటయ్యాక..
సెల్లు గోల..
– “ఊ చెప్పు”
“బయట  _ _ వాన_ _ నువ్వూ__” ముక్కలు ముక్కలు గా శ్రీవారు..కవరేజ్ లేదేమో .. వాన కదా ,
hmm ఒక నిట్టుర్పు.”వస్తున్నా wait ఇంటికెళ్దాం”

రోడ్డు మీద మూసీ లు మురికి జలపాతాలు…
తెరిచి పెట్టిన మాన్ హోల్ లు,
దారి లేక బస్ స్టాండ్ లో బిచ్చగాళ్ళు,
తడిచిన బట్టల్తో లేక గొడుగుల్తో జనాలు,
గోడల చాటున దాక్కుంటూ కుక్క పిల్లలు,
ఆటో వాలా కి మంచి గిరాకీ లు.
ఒక్కటే వాన …
ఇవన్నీ కోణాలు.

11 thoughts on “మా ఊర్లో నిన్న వర్షం

  1. చిక్కటి వాన .. వెచ్చటి కాఫీ .. చేతులో ఒక మంచి పుస్తకం .. చుట్టూ అల్లుకుని ఒక సంగీతం.
    బాగుంది స్వాతి గారూ.
    శేఖర్ సినిమాల్లో ఇన్ని దృక్కోణాలు కనబడతాయని నేను అనుకోను గానీ, అతనికి వాన అంటే ఇష్టమని తెలుస్తూనే ఉంది – విజయగారి కామెంటు కూడా బాగుంది.

  2. ఏ వర్షం సాయంత్రం అయినా చాలా బాగుంటుంది కదా.కిటికీ లోంచి చూస్తుంటే మనసులో గూడు కట్టుకున్న దిగులు మబ్బులన్ని వర్షించేస్తున్నట్టు,చీకాకులన్నీ పారిపోయినట్టు,ఏదో తెలియని ప్రశాంతత ఆవరించినట్టు….ఒక్క వర్షం ఎన్ని వేల భావాలను కలిగిస్తుందో.ఈ పోస్టు గురించి విజయ గారి మాటే నామాటా.

  3. స్వాతి గారూ, చాలా బాగుంది.
    ఇంకా ఎక్కువ చెప్పేకంటే ఇంకొన్ని సార్లు చదవడంతోటే మీ మాటల విలువ పెంచగలను.

    ఇంకొక్క కోణం, ఇక్కడికి వెళ్ళి “వాన వేళ” మీద నొక్కండి.

    http://telugu4kids.com/TeluguPaatalu.aspx

    లలిత.

  4. నేను ఈ మధ్య “వాన ” సంకలనం చేద్దామని రాసినవారు పంపమని, రాయనివారు రాయమని కోరుతూ బ్లాగు టపా రాసాను

    ఇంతకుముందు ఎవరైనా రాసారా అని వెదకాలనిపించి వెదకుతుంటే , మీ టపా కనిపించింది.

    బాగుంది… బాగుంది

    నా సంకలనంలోకి తీసుకుంటున్నాను

    అభినందనలు

Leave a reply to కొత్త పాళీ స్పందనను రద్దుచేయి