సింధువు

గవ్వల గనుల అన్వేషణ లో
అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో
ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో
పసితనపు పాటలకు
పరుగులెత్తి పడిన పందేలకు
సేద తీర్చిన సాగర సమీరం.

కలల తీరం లో
ప్రేమ పారవశ్యం లో
ఊహల భారం తో
మాటలు వెదికే మౌనం లో
మెల్లని కెరటాలని
పాదాల మీదకి పంపి
తలపులని తేలిక చేసే ఆర్ద్ర సముద్రం.

చిత్తమంతా చింతలు ముప్పిరిగొని
ఒకదాన్నొకటి ఢీకొని
ఒక్కో అల ఉద్రేకం తో ఎగసిపడి
మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి
ఆటు పోట్ల అంతస్సంఘర్షణ
నిదర్శనం గా కల్లోలపు కడలి.

ఘడియో క్షణమో
ఉద్రేకమో క్రోధమో
జీవితాల్నీ ఆశయాల్నీ
ఇళ్ళ్లనీ ఊళ్ళనీ
సుడిగుండాలతో సునామీలతో
మున్నీట ముంచిన
మహోగ్ర మహార్ణవం.

*తొలి ప్రచురణ  పొద్దు లో

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

13 Responses to సింధువు

 1. srinivasu అంటున్నారు:

  Its very nice

 2. kesh అంటున్నారు:

  mee blog bagundi… kalaaniki, kalharanaiki vantena kattina teeru inka bagundi. keep it up. veelaite http://www.kesland.blogspot chudandi

 3. Bhanu అంటున్నారు:

  mee blog name mee abhiruchini pratibimbistoondi. mee kavithvam baagundi.abhinandanalu. i invite you to my blog lalithya.blogspot.com

 4. Srini అంటున్నారు:

  Really superb. Very touching & read a nice telugu poem after long time.

 5. raviverma అంటున్నారు:

  మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి
  ఈ ప్రయోగం నాకు చాలా నచ్చింది. చాలా విస్తారమైనవాటిని చాకచక్యంగా ఒడిసిపట్టుకుని కొన్ని పదాల్లో బాగా చెప్పారు.

  ———
  శ్రీధర్.

  http://chelam.blogspot.com
  http://sridharchandupatla.blogspot.com

 6. కొత్త పాళీ అంటున్నారు:

  జూన్ నించి అక్టోబరుకి నాలుగు నెలలు.
  త్వరలో మీ కొత్త పద్యాన్ని చూడాలి.
  No pressure 🙂

 7. రానారె అంటున్నారు:

  జూన్ నించి అక్టోబరుకి నాలుగు నెలలు.
  త్వరలో మీ కొత్త పద్యాన్ని చూడాలి.

 8. radhika అంటున్నారు:

  నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.

 9. వింజమూరి విజయకుమార్ అంటున్నారు:

  “మూసిన తలుపుల మనసు గదిలో విరహాగ్ని విశ్వహోమ జ్వాలగా ఉద్దీపితమై నన్ను దహించి బాధిస్తోంది” అంటూ ఓ పేజీడు లేఖా సాహిత్యం రాసి పెట్టాను ఓ రచయిత్రికి చాన్నాళ్ళ క్రితం ఓ రోజు ఓ ప్రయోజనార్థం నన్ను అడిగితే. ఈ బ్లాగులోని సమీప తీరాలు టపా అటువంటి ఓ కన్నెపిల్ల విరహం తరహా అనుకుంటే. . . ఇక ఈ సింధువు గురించి. . .

  ఇది మనిషికీ, బాల్యానికీ, మనసుకీ, సముద్రానికీ కడకి చావుకి సైతం లంకె వేసిన సుకుమారమైన కవిత. “గవ్వల గనుల అన్వేషణ లో అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో” యింతకి మించి బాల్యాన్ని, దాని అమాయకాన్ని సారస్వతంలో ప్రయోగించదగిన వాక్యాలు బహుశా వుండవేమో. ఇంత గంభీరంగా మొదలైన ఈ కవితలోని రెండవ చరణం కొంత పేలవంగా మామూలుగా వుంది. ఇటువంటి దగ్గర కవయిత్రి మరి కొంత శ్రద్ధ తీసుకుని వుంటే బావుండేది. తర్వాత, మూడవది.

  “అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి” అనే సీతాకోకచిలుక చిత్రంలోని కమ్మని పాటని గుర్తుకుతెస్తుందీ మూడవ చరణం. “చిత్తమంతా చింతలు ముప్పిరిగొని ఒకదాన్నొకటి ఢీకొని ఒక్కో అల ఉద్రేకం తో ఎగసిపడి మరో తరగ ఇక ఎగరలేక విరిగిపడి ఆటు పోట్ల అంతస్సంఘర్షణ నిదర్శనం గా కల్లోలపు కడలి.” మరో తరగ ఇక ఎగరలేగ విరిగి పడిందట. మనసు కేంద్రంలోంచి ఒకటొకటిగా తొమొకటిగా పైకి లేచే భావాలను, భావజాలూలనూ, conflict నూ యింత నిష్టూరంగా సముద్రపుటలతోగాక యిక దేంతో పోల్చగలం?

  “నానాటి బ్రతుకు నాటకమూ” అంటూ కడకి కడతేర్చే ‘కడలి’ ప్రత్యక్షమోతుంది ఈ చివరి చరణంలో. ఘడియో క్షణమో. . . అంటూ సుడిగుండాలతో సునామీలతో మున్నీట ముంచిన మహోగ్ర మహార్ణవం అట. ఈ ‘మున్నీట’ అనే పదం. . . సమీప తీరాలు టపాలో ‘అనువు’ దొరికితే లాగా సాహితీ హృదయం మాత్రమే ప్రవచించ గల పరిణతి పదాలు. స్వాతి గారు వయసులోనూ చాలా చిన్న వారుగా తెలియవస్తున్నది. ఇటువంటి పరిణతి గల చిన్న వయసు వారిని ప్రోత్సహించడం ఏంతైనా మన బాధ్యత. స్వాతి గారిని కూడా నెలకో, నాలుగు నెలలకో కాకుండా తరచుగా కవితలు రాస్తూండమని కోరుతున్నాను.

 10. subrahmanyam అంటున్నారు:

  కొత్తదనం లేదు. మరింత క్లుప్తత, సరళత అవసరం. శబ్దలౌల్యం వద్దు. సాధ్యమైనంత
  సూటిగా, సరళంగా రాయడానికి ప్రయత్నించండి.

 11. ప్రియ అయ్యంగార్ అంటున్నారు:

  మీ కవితని చదివాను. బాగుంది. ప్రత్యేకించి,

  “గవ్వల గనుల అన్వేషణ లో
  అందమైన సంపద పోగేసిన ఆశ్చర్యం లో
  ఇసుక గూళ్ళు కట్టిన అమాయకపు గర్వం లో
  పసితనపు పాటలకు
  పరుగులెత్తి పడిన పందేలకు
  సేద తీర్చిన సాగర సమీరం.”

  నాకు బాగా బాగా నచ్చింది.

 12. సింధు అంటున్నారు:

  ఏంటమ్మయ్.. ” సింధు ” అని పెడితే నేను రాయల్టీ అడుగుతానని.. ” వు ” తగాలించావే చివర్న.. [సరదా దురద.. ;-)]…….. కవిత మాత్రం చాలా బావుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s