కె. విశ్వనాథ్

1.jpg2.jpg

నా అభిమాన దర్శకులు విశ్వనాథ్ గారిపై beyondindia పత్రిక ఏప్రిల్ సంచిక లో నా వ్యాసం ప్రచురితమైంది.

-కల్హార

ప్రకటనలు
This entry was posted in మాటల తోట. Bookmark the permalink.

8 Responses to కె. విశ్వనాథ్

 1. santhosh అంటున్నారు:

  miru baraha rasara leka vere software tho na .font bavundi.
  – reply

 2. radhika అంటున్నారు:

  ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.వారి సినిమాలు చూసి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సంగీతం,నాట్యం నేర్పించారట.మంచి సినిమా శక్తి ఏమిటో ఈయన నిరూపించారు.
  స్వాతిగారూ మీరు పత్రికల్లో కూడా కనపిస్తారని ఆశిస్తున్నాను.

 3. కొత్తపాళీ అంటున్నారు:

  ఓహో, మీరు వ్యాసాలు కూడ రాస్తారన్న మాట. భేష్! పోనీ కవిత్వం అంటే ఇన్స్పిరేషను రావాలిగా రమ్మన్నప్పుడల్లా వస్తుందా అనుకోవచ్చు, ఇలాంటి చక్కటి వ్యాసాలు రాస్తూ ఉండొచ్చుగా ఈ లోపున?

 4. కె.మహేష్ కుమార్ అంటున్నారు:

  సంక్షిప్తంగా , బాగుంది వ్యాసం.

  ఆంధ్ర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈయన సినిమాలు నాకు ఇష్టమైనా,
  అంతగా ఆడని “స్వాతికిరణం” ఉత్తమమైన సినిమా అనిపిస్తుంది.
  మంచి దర్శకుల స్థాయిలో ఎన్నదగిన దర్శకుడైనప్పటికీ, విశ్వనాధ్ గారిని భారతదేశం లోని గొప్ప దర్శకుల కోవలోకి చేర్చడంలో మనం ఎందుకు విఫలమయ్యామని ప్రశ్నింఛుకోవాలి.

 5. అబ్రకదబ్ర అంటున్నారు:

  స్వాతిగారూ,

  వ్యాసం చాలా బాగుంది. స్కాన్ లు పెట్టేబదులు కాస్త ఓపిక తెచ్చుకుని మీ ఇ-మెయిల్ నే ఇక్కడ ప్రచురించాల్సింది.

  కళాతపస్వి గురించిన కొన్ని చిన్నా పెద్దా విశేషాలు:

  విశ్వనాధ్ ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర పని చేశారు సహాయదర్శకునిగా. అంతకు ముందు కూర్పరి (ఎడిటర్)గా పనిచేశారు.

  విశ్వనాధ్ గారి సినిమాల్లో చిన్న పాత్రలోనైనా తప్పని సరిగా కనిపించే నటులు ఇద్దరు: సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి. ఒకటో రెండో తప్ప అన్ని చిత్రాల్లోనూ వీరిద్దరూ ఉన్నారు.

  కొబ్బరి చెట్లు కనిపించని విశ్వనాధ్ సినిమా లేదేమో. ‘చిన్నబ్బాయి’ (వెంకటేష్) చిత్రానికి మారిషస్ లో షూటింగ్ జరిపితే మన పెద్దాయన అక్కడా కొబ్బరి చెట్లే చూపించాడు. ఈ విషయమై ఈనాడులో రివ్యూ రాస్తూ గుడిపూడి శ్రీహరి అన్నది కాస్త మోటుగా ఉన్నా నాకు భలే కామెడీగా అనిపించింది: ‘వెంకాయమ్మ అమెరికా వెళ్లినా కిళ్లీ కొట్టే పెట్టుద్ది, కానిస్టేబుల్నే ఉంచుకుంటది. అలా ఉంది విశ్వనాధ్ మారిషస్ లో సినిమా తీయటం’.

  1991లోనో 92లోనో, కళాకృష్ణ ప్రధాన పాత్రలో ‘సిరిమువ్వల సింహనాదం’ అనే సినిమా మొదలెట్టరు గానీ అదెందుకో పూర్తికాలేదు.

  ‘స’ అక్షరానికీ విశ్వనాధ్ కు ఉన్న అనుబంధం మళ్లీ చెప్పనవసరం లేదు. వేరే అక్షరంతో మొదలయిన ఆయన సినిమా పేర్లు (నాకు తెలిసినవి):

  1. ఆత్మ గౌరవం
  2. జీవిత నౌక
  3. జనని-జన్మభూమి (బాలకృష్ణ)
  4. ఈశ్వర్ (అనిల్ కపూర్)
  5. ఆపద్బాంధవుడు
  6. ధన్ వాన్ (సునీల్ షెట్టి)
  7. చిన్నబ్బాయి

  ‘పూర్ణోదయా’ ఏడిద నాగేశ్వరరావుకి విశ్వనాధ్ కి ఉన్న అనుబంధం కూడా గొప్పదే. కొన్ని ఆణిముత్యాలొచ్చాయి వీళ్లిద్దరి కలయికలో. పూర్ణోదయా వాళ్ల ‘స్వరకల్పన’ నిజానికి విశ్వనాధ్ చేయాల్సిన సినిమా. కారణాంతరాల వల్ల వంశీ చేయవలసి వచ్చింది.

 6. సింధు అంటున్నారు:

  చాలా పొందికగా బాగా రాశావక్కా.

  ” పద్మశ్రీ ” ఎంత ఉన్నత సత్కారమో మనకి తెలుసు. ఈ మధ్య కాలం లో ” పద్మశ్రీ ” సర్కార గ్రహీతల్ని గమనిస్తే అనర్హులకు ఇచ్చారా, లేక ” పద్మశ్రీ ” స్థాయి తగ్గిందా అనిపించక మానదు. కానీ, ఎన్నో అద్భుత కళా ఖండాలను తీర్చిదిద్దిన ఇటువంటి వ్యక్తి కి కట్టబెట్టటం వలన, ” పద్మశ్రీ ” సత్కారన్నే సత్కరించి దాని వన్నె ను దానికి తిరిగి అప్పజెప్పటమే అని చెప్పాలి. ఈ మహర్షి… ఈయని గురించి ఏమి చెప్పినా తక్కువేనేమో. ఎన్నెన్ని ఆణిముత్యాలను మనకందించారు.. ఆస్వాదించ, రస హృదయం ఉండాలే కానీ, శారీరక, మానసిక అవకరాలేవీ మన సంతోషాన్ని మనకి దూరం చేయలేవు అనే ఆయన మదిలో నమ్మకాన్ని, అత్యభుతం గా సదృశ కావ్య మాలికలు గా చేసి ” సిరివెన్నెల ” ” స్వాతి ముత్యం ” అంటూ వాటికి నామకరణం చేశారు. ఒకపక్క కమర్షియల్ చిత్రాల జోరెంతో చూస్తూనే, ” సిరివెన్నెల “, ” సూత్రధారులు ” వంటి సినిమాలు తీశారు అంటే, కళ ను, విలువలను, ఆయన ఎంతగా గౌరవించారో అర్ధమవుతుంది. అందుకే కళాకారులు, ప్రేక్షకులు సహితం ఆయనకు నీరాజనం పట్టారు.

  ఇక్కడ మరొక విషయం చెప్పవచ్చేమో.. ఆయన అంతటి మనిషయినా సరే, అకస్మాత్తుగా ట్రాఫిక్ లో ఆగి ఉన్న కార్ లో ఆయన్ని చూసి ఆస్చర్యంతో నోరు వెళ్ళబెట్టిన అభిమానిని స్నేహం గా పలకరించి, పసిపిల్లాడిలా చిరునవ్వులు చిందించటం, ఆయన ఒదిగి ఉండే సహృదయానికి దర్పణం. ఇది మా స్నేహితుల అనుభవం.

 7. Nutakki Raghavendra Rao అంటున్నారు:

  స్వాతీజీ , విశ్వనాధ్ గారి గురించి అధ్భుతంగా రాశారు. వ్యాసం బాగుంది..ఆయన గురించి ఇంకెంత రాసినా చదవాలనిపిస్తుంది. అభినందనలు.
  నాదో చిన్న రిక్వెస్ట్. నా “ద్విశత టపోత్సవం దరి చేరనున్నవేళ” నా http://www.nutakki.wordpress.com లో మీరుlatest post.
  తప్పకుండా చూడాలి….with cardial wishes……Nutakki

 8. శ్రీనివాస్ పప్పు అంటున్నారు:

  విశ్వనాథ్ గారి మీద ఒక బ్లాగ్ మొదలుపెడుతున్నానండి,అందులో మీ ఈ వ్యాసం వేసుకోడానికి అనుమతి,రెండోది ఆ వ్యాసం ఉన్న మెయిల్ మెసేజ్ నాకు ఇస్తే ఆ బ్లాగ్ లో ప్రచురిస్తాను.మీ అంగీకారం నా ఐడి లొ తెలియచెయ్యగలరు.
  pappusreenu@gmail.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s