‘మోహ’మాటాలు

మాటల మారాకులేసిన వసంత వనాల్లో
తడి చూపుల తుమ్మెదలదేమో మౌనభాష
మధూలిక రాలి బదులిచ్చేవరకూ
పరిప్రశ్నలన్నీ ప్రభవ వేదనల్లోనే

పున్నమి తో పోటెత్తిన సముద్రపు హోరులో
సైకత తీరపు నిశ్శబ్ధ ఘోష వినబడుతుందా?
తడి పొడుల సంధిలో తపించే కల్పాల కాలమంతా
చలి వెన్నెల్ని ఊపిరి నెగళ్ళతో కాచుకోవాలిక

తనూవల్లకి పై నిక్వణించిన తమకానికి
పిల్లగాలి పరవళ్ళెత్తే పిల్లనగోవి పాటతో
సడి రాత్రి సన్నజాజి సరాల సందట్లో
జత గాత్రాల జుగుల్బందీ  వీలౌతుందా?

ప్రకటనలు
This entry was posted in ‌పోస్ట్ బాక్స్. Bookmark the permalink.

19 Responses to ‘మోహ’మాటాలు

 1. మెహెర్ అంటున్నారు:

  చాలా బాగుంది.

 2. viswanadh అంటున్నారు:

  అబ్బ ఎన్ని రోజుల్నించి ఎదురు చూస్తున్నానండి మీ టపా కోసం.
  ఎప్పటిలాగే చాలా బాగుంది.

 3. KumarN అంటున్నారు:

  నాకేదో కొంచెం అర్ధమయ్యింది కానీ, కొంచెం వివరిస్తారా? నాకు తెలుసు, ఇలాంటివి వివరించమని అడగడం నేరం. ఆస్వాదించాలే కానీ, వివరిస్తే అందులోని అనుభూతి పోతుంది అని తెలిసీ.., భయం వదిలించుకొని కొంచెం ధైర్యం చేసి అడుగుతున్నా..

 4. ఉష అంటున్నారు:

  గుండెని ఒక్కో చిక్కని పంక్తి తో కట్టేసారు.. మాట తెలియని స్పందన మొహమటంగా తలవంచుకుంది. తడిపొడుల తపన మరిదేన్నో తట్టిలేపను తన దారి తను చూసుకుంది.

  చాలా చిక్కగావుంది.

 5. కత్తి మహేష్ కుమార్ అంటున్నారు:

  బాగుంది. కానీ కొంత కష్టపడితేగానీ అర్థంకాలేదు. కానీ ఒకసారి అర్థమయ్యాక వచ్చిన అనుభూతి బాగుంది.

 6. రవి చంద్ర అంటున్నారు:

  కవిత్వమంటే ఇలా ఉండాలి మనసును తట్టి లేపేలాగా….

 7. మేధ అంటున్నారు:

  నాకూ మొదటి సారి చదివినప్పుడు ఏమీ అర్ధమవలేదు.. కానీ అర్ధమైన తరువాత అర్ధవంతంగా అనిపించింది 🙂

 8. నిషిగంధ అంటున్నారు:

  కవిత పేరే చాలా నచ్చేసింది!! అసలు మీ టపాల పేర్లకే నేను అభిమానినైపోయాను 🙂

  ఇక ఇలాంటి పంక్తులు చదివాక మాటలకి భాష వెతుక్కోవాలి!!

  “తడి పొడుల సంధిలో తపించే కల్పాల కాలమంతా
  చలి వెన్నెల్ని ఊపిరి నెగళ్ళతో కాచుకోవాలిక”

  ఉషగారి మాటతో ఏకీభవిస్తాను.. ఎంతో ‘చిక్కని ‘ కవిత!

 9. Nutakki raghavendra Rao అంటున్నారు:

  “మధూలిక రాలి బదులిచ్చేవరకూ
  పరిప్రశ్నలన్నీ ప్రభవ వేదనల్లోనే”
  గంభీర పద విన్యాసం, అధ్భుతం. అభినందనలు.

 10. Purnima అంటున్నారు:

  ఓహ్.. నేను మీ పోస్టులన్నీ మిస్స్ అవుతున్నాన్న మాట! 😦

  కవిత అద్భుతంగా ఉంది. మరింత తరుచుగా రాస్తూ ఉండండి.. 🙂

 11. Purnima అంటున్నారు:

  మీ పోస్టులకి ఈమెయిల్ సబ్ స్క్రిప్షన్ చేసుకుంటున్నా.. మర్చిపోను.. 🙂

 12. pasunuru sreedhar babu అంటున్నారు:

  తడి చూపుల తుమ్మెదల మౌనభాష..
  .. సైకత తీరపు నిశ్శబ్ద ఘోష..
  చాలా బాగుంది. జుగల్బందీ అన్న తరువాత ఇంక ‘జత గాత్రాల’ అనాలా? ఇదొక్కటే అభ్యంతరం కానీ.. పేరుతోనే ఆకట్టుకున్న ఈ కవిత సముద్రం మీద వెన్నెల పడవలో ప్రయాణం చేయించింది పౌర్ణమి సంగీతాన్ని వినిపిస్తూ…

 13. స్వాతి కుమారి అంటున్నారు:

  శ్రీధర్ గారూ,
  గాత్రమంటే శరీరమనే అర్ధాన్ని స్ఫురింపజేయటానికి ’జత గాత్రాలు’ వాడవలసొచ్చింది.

 14. radhika అంటున్నారు:

  ఇది మిస్ అయ్యానన్న మాట.
  అందరూ అన్నీ చెప్పేసాకా నాకేమీ మిగల్లేదు. ఎప్పటిలానే చాలా చాలా బావుంది.

 15. msnaidu అంటున్నారు:

  namaste.
  a new sound and muse

 16. srinivas అంటున్నారు:

  hm padalu chala rathavanthanga vunnayandi.. assalu idi mamulu matallu vunde kavitha kaadu. n mamuluga okkasari chadivithey assalu artham kaledandi,……. chaala bhgundiii n nenu innirojulu miss ayyanu mee kavithani……..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s