అయ్యో! దిగులు..
మరో మనిషితో చెప్పుకోలేనంత,
మాటల ఆసరాతో దింపుకోలేనంత..
మరో మనిషితో చెప్పుకోలేనంత,
మాటల ఆసరాతో దింపుకోలేనంత..
రోజూలానే ఆ సాయంత్రమూ –
లోతుతెలీని లోయలాంటి
ఒంటరితనంలో,
రాలిపడుతున్న
ఉసిరిచెట్టు ఆకుల మధ్య-
కుర్చీ చేతులకి మోచేతులప్పజెప్పి,
ఒళ్ళో పుస్తకం మీద
మసగ్గా అలుక్కుపోయిన
తడి అక్షరాలవైపు
పట్టలేనిజాలిని
ప్రసరించుకున్న
పల్చటి జ్ఞాపకాల్లా..
ఇప్పుడెందుకిలా??
————–
మొదటి ప్రచురణ ఈమాటలో
మీ పదాల పొందిక బాగుంది. ముందు కవితలో కూడా.
స్వాతి కుమారిగారూ ఎలా వున్నారు?చాలా రోజుల తరువాత మీ బ్లాగులోకి తొంగి చూడటం తటస్త పడింది.
మీరు ‘ఇప్పుడెందు కిలా’ అంటే……? మీ మనస్సు మరింకెక్కడో అని కదా మరి.
ఈ మీ భావ వీచిక చాల బాగుంది.ఈ స్పందనకు ప్రతిగా స్పందిస్తారని భావిస్తూ …….శ్రేయోభిలాషి …..నూతక్కి రాఘవేంద్ర రావు.
మీ కవితలు చాలా బావున్నాయి స్వాతిగారూ. శుభ్రమైన భావాలు, భాష, తాజాదనం.. ఇవివ్ చూడటం సంతోషంగా ఉంది..