మళ్ళీ ఉదయం వచ్చి వెలుతురు మరకల్ని అంటించేవరకూ
ఈ రాత్రి స్వచ్ఛంగా మలుగుతుంది.
పచ్చని ఆకు జీవితానికి –
పట్టుమని ఒక్కగానొక్క వసంతం వరంగా దొరుకుతుంది.
చంచల చిత్తానికి-
పంచేంద్రియాలతో పంచుకోలేని ధ్యాన భిక్ష క్షణమాత్రపు సౌఖ్యాన్నిస్తుంది
మృత్యువు పాదాలమీద పడ్డ అనుభవం
జ్ఞానం వైపు చూసి ఏదో సంకేతాన్నిస్తుంది.
(మొదటి సారిగా ఈమాటలో)
చాలా బాగుంది. ఎంతైనా ఈమాట ప్రచురణాస్థాయి కదా మఱి.
chalabagundhi adbhuthanga undhi
మృత్యువు పాదాలమీద పడ్డ అనుభవం
జ్ఞానం వైపు చూసి ఏదో సంకేతాన్నిస్తుంది.
eevakyalu inkabagunnai thanks writer
Wow!!
Avaakku nai alaa……adbhutam…..Sreyobhilaashi …Nutakki
‘మళ్ళీ ఉదయం వచ్చి వెలుతురు మరకల్ని అంటించేవరకూ
ఈ రాత్రి స్వచ్ఛంగా మలుగుతుంది.’
కవిత చాలా బాగుంది స్వాతిగారూ..