ఊపిరిపాటకు చూపేదీ?

శిల్పాల్నీ, శిధిలాల్నీ సాగరాన్నీ, నగరాన్నీ మేల్కొలుపుతూ వినబడ్డాడతను వేకువల్ని వణికించే వేణువుగా. గాలి మడుగులో రాగాల జాడలు పట్టుకుని వెదుక్కుంటూ వెళ్ళి చూశానతన్ని చూశానా? కాదు కరుణించి కనపడ్డాడు పాట ఆపినపుడు మురళితోబాటు మహాబలిపురాన్నే సంచిలో పెట్టుకున్నాడా అని? జలదరించిన ఉదయాలను సంగీతానికి వదిలి రాత్రుల్ని కళ్ళుగా చేసుకున్నాడా అని? అడగలేదు – ధ్యానానికి కొనసాగింపు మౌనమే కావాలని. బాగా రాత్రయింది, తోడొస్తాను ఇంటిదాకా అంటే నిశ్శబ్దంగా నవ్వాడు చీకటి నా తోబుట్టువని మీకు తెలీదా? అన్నట్టు“ఊపిరిపాటకు చూపేదీ?”ని చదవడం కొనసాగించండి

గాలి మళ్ళింది

“ఇహనో, ఇప్పుడో వచ్చేస్తారు వీళ్ళు ఇదిగో బాబూ! మరికాసేపు ఉండకూడదూ? ఒక్కత్తినే కదూ ఇంత పెద్ద ఇంట్లోనూ…” సర్దుక్కూచుంటాడు ఆఖరి అవకాశంగా గోడగడియారాన్ని గద్దిస్తున్నట్టుగా ఇంకాసేపు చూస్తే అద్దాల వెనక బొమ్మలు అరిగిపోతాయేమో అన్నట్టుగా “దాటిపోయారు ఆ మనుషులు, ఆరోజులిలా ఉండేవా? ఏ నలభయ్యేళ్ళో అవదూ, ఆయన కూడా… హూఁ ఇదిగో నా చేతులు, వణక్కుండా పట్టుకోలేను దేన్నీ మజ్జిగన్నం ఒలకబోసేస్తాననీ… పనిపిల్లే పెడుతుంది చెంచాతో రోజూ, తల్లెవరో, పిల్లలెవరికో? మా అమ్మ పోయేనాటికి ఇంతపిల్లని…” సాయంత్రపు“గాలి మళ్ళింది”ని చదవడం కొనసాగించండి

భ్రష్టయోగి

తిరిగి దొరకడానిక్కాక వెతికించుకోవడానికే తప్పిపోయిన ఒక పద్యంకోసం రోజులతరబడీ, రాత్రులవెంబడీ ఆకలీ ఆహారమూ తనకు తనే అయి రాసుకున్నాడేవో కొన్ని సౌందర్యోన్మత్త గీతాల్ని… కిటికీ అంచులు ఏటవాలు నీడల్ని ఇంటిగోడలపైకి జారవిడుస్తూ ఏకాంతంలో బద్ధకంగా చల్లుకున్న దిగులు గింజల చుట్టూ బూడిదరంగు పావురాలు రెక్కలు ముడుస్తూ తెరుస్తూ మసలినప్పుడు పాదాక్రాంతమయ్యాడు ఆ మచ్చికైన హేమంతపు సాయంత్రాలకి… పగడపు గోరింట పాదాలు ఇసుకలో గీసిన ఇంద్రధనస్సుని తాడుపైన గారడీలాంటి చూపులతో కౌగిలించబోయి అగ్గిపుల్లని చూసి అణువణువూ జలదరించిన అగ్ని“భ్రష్టయోగి”ని చదవడం కొనసాగించండి

వాంగ్మూలం (కథ)

వాంగ్మూలం   గుండె పగిలిపోతోందిరా చిన్నోడా.. యాభయ్యేళ్ల ఒంటరోడిని, తాగుబోతు నా కొడుకుని, అర్ధరాత్తుళ్ళు ఫోన్‌ చేసి “లవ్  యూ రా  బంగారుకొండా” అంటే సంస్కారపుజబ్బు ముదిరినోడివి కాబట్టి నా మత్తు సంగతి కనిపెట్టి నీ నిద్రమత్తుని దాచిపెట్టి “ఇవ్వాళ కూడా డోసెక్కువైందా?” అని విసుక్కోకుండా అడిగినప్పుడు ఎంత ముచ్చటేసేదిరా! సఫరింగ్, సఫరింగ్, సఫ – రింగ్, టేబిల్ మీద ఖాళీగా గ్లాసుల అడుగుజాడల రింగులు. వలయాలు, వేదనా వలయాలు, శోధనా వలయాలు. కళ్ళు తిరిగి వళ్ళు“వాంగ్మూలం (కథ)”ని చదవడం కొనసాగించండి

అరచేతిలో ఆకాశం

ఆకాశమంటే పొగకాదు, చెల్లాచెదురైన ధూళి మబ్బుల సమూహం కాదు. పదార్ధమూ, శూన్యమూ కాదు. కొన్ని అస్తిత్వాలు లేవని చెప్పడానికి ఎంత గట్టి ఋజువులుంటాయో ఉన్నాయని తెలుసుకోవడానికి అంతకంటే బలమైన నమ్మకం ఆసరాగా ఉంటుంది; దైవం లాగా, ఆకాశంలాగా. ఆ నమ్మకాల్లో ఉండే గొప్ప నిశ్చింత, నిబ్బరం, ఆనందం, ఆహ్లాదం- ఇవే వాటి రూపాలు, రూపాంతరాలు, అస్తిత్వాలూ. తన రూపరహిత స్వరూపాన్ని నీటిలో చూసుకునే అకాశంలాగే కవిత్వమూ చదువరి పొందే తాదాత్మ్యతలోనే తనని తాను పోల్చుకుంటుంది. గీటురాయి మీద“అరచేతిలో ఆకాశం”ని చదవడం కొనసాగించండి

ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం

తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగినవాటిల్లో కాటమరాజు కథాచక్రం ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి ఆరుద్ర ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. దీన్ని సశాస్త్రీయంగా మరికొంత సంస్కరించి పరిష్కరించాలని భావించినా, ’సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర’ రచన కారణంగా ఆ పని చెయ్యలేకపోయారు. సమగ్రాంధ్ర“ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం”ని చదవడం కొనసాగించండి

తెల్లరంగు సీతాకోకచిలుకలు

అనుమానం; చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు కంటికి సమాంతరంగా సాగని చూపులు ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు —– నమస్కారం; తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు వంచనకి —– అవసరం; గాయపడని చోట ముందు చూపుతో కాస్త మందు ఆత్మను కాపాడుకోడానికి అహానికో చెంపదెబ్బ ఇంకా నేర్చుకోని పాఠాలకి కాసేపు విరామ చిహ్నం —– మొదటి ప్రచురణ మాలికలో

లావానలం

నీటి మడుగుచుట్టూ రెల్లుగడ్డి పహారా నిర్భయంగా సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు — దివారాత్రాల రాపిడిలో కళ్ల వెనక రంపపు పొడి సంధ్య ప్రవహిస్తున్న లోకాన్ని వ్యధల ఊబిలోంచి అచేతనంగా చూస్తూ ఆశ కొడిగట్టిన ఆత్మకు కవిత్వపు కొన ఊపిరులూదుతూ అక్షరం —- ఓదార్చేందుకు ఎవరూలేని మరోచోట రాత్రంతా బాధను దింపుకోవడానికి అవనతమౌతున్న సూర్యుడు. యుగాలనుండీ అలానే పడి ఉన్నా చుక్కల్ని కలిపి ముగ్గు పెట్టే దిక్కులేక పాడుపడ్డ ఆకాశం. చావు గీటురాయి మీద తప్ప జీవితాన్ని“లావానలం”ని చదవడం కొనసాగించండి

ప్రాప్తం

మళ్ళీ ఉదయం వచ్చి వెలుతురు మరకల్ని అంటించేవరకూ ఈ రాత్రి స్వచ్ఛంగా మలుగుతుంది. పచ్చని ఆకు జీవితానికి – పట్టుమని ఒక్కగానొక్క వసంతం వరంగా దొరుకుతుంది. చంచల చిత్తానికి- పంచేంద్రియాలతో పంచుకోలేని ధ్యాన భిక్ష క్షణమాత్రపు సౌఖ్యాన్నిస్తుంది మృత్యువు పాదాలమీద పడ్డ అనుభవం జ్ఞానం వైపు చూసి ఏదో సంకేతాన్నిస్తుంది. (మొదటి సారిగా ఈమాటలో)

నిర్వేదన

తనువుని తెంపిన తొలకరి మొలక తరువుగా మారాలని తడిమట్టి తపస్సు విరబూసిన పరిమళాల్ని చిరుగాలిపై రువ్వుతూ మూలాల్ని దాచిన మొక్క మిడిసిపాటు తానెన్నటికీ చూడలేని వసంతాలను వర్షిస్తూ లోతుగా ఎదుగుతున్న వేరు వినమ్రత —————- మొదటి ప్రచురణ పొద్దులో