ప్రతికవీ ఏదో ఒక సందర్భంలో తన కవిత్వ స్వరూపమేమిటో, కవిత్వంతో తన అవసరమేమిటో ప్రశ్నించుకుంటాడు. యాధృచ్ఛికంగానో , ప్రయత్నపూర్వకంగానో దొరికిన ఆధారాల్ని సమకూర్చుకుని కొన్ని నిర్వచనాల్ని రచించుకుంటాడు. అలాంటి ఒకానొక సందర్భంలో “అనంత దూరాల యానంలో నిరంతరమూ సాగే కాంతి వేగాల జలపాత ఉరవడి” గా కవిత్వాన్ని అభివర్ణిస్తారు అవ్వారి నాగరాజు గారు. ఆయనే మరొకచోట “అపురూపమైనవేవీ ఈ కవితలలో పలకవు/చెక్కిళ్ళ మీద జారిన పాలచారికలలాంటి ఙ్ఞాపకాలనేమీ ఈ పదాలు పుక్కిట పట్టవు.” అని తన పదాల“అద్దం లాంటి రోజొకటి”ని చదవడం కొనసాగించండి
Category Archives: తోకచుక్కలు- కవిత్వ వ్యాసాలు
తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా…!
“నువ్వు ఒక మాట అంటావు, అది భలే బాగుంటుంది/మాట మీద కాసేపు నడుస్తావు ప్రత్యేకించి పనేం లేక” – అలవోకగా, అలవాటుగా, అనాలోచితంగా అన్న చాలా మాటల్లోంచి బాగున్న మాటలని ఒకచోట పోగుచేస్తే, ఆ బాగున్న ఒక్కోమాట మీదా కాసేపు అదే పనిగా నిలిచిపోతే, అలా నిలిచి వెనక్కూ, ముందుకూ నడుస్తూ ఆ మాట తుదీమొదలూ తేల్చుకునేందుకు మొండికేస్తే; బహుశా, ఆ మొండి ప్రయత్నమే కవిత్వమౌతుంది కాబోలు. అలా నడుస్తూ, తిరుగుతూ ఎప్పటికో “ఏది బయల్దేరిన చోటు“తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా…!”ని చదవడం కొనసాగించండి
నేను ముందే చెప్పలేదూ?
“చీరండలు కొన్ని ళూ అని పాడుకుంటున్నాయి. ఎవరైనా వింటారని కాదు అవి చీరండలు, అలా పాడుకుంటాయి.” ఎలదోట వంపుల్ని వెన్నెల వెలిగించే వేళల్లో తోవ కడాకూ ఏటూ తోచనితనాల్ని సాగతీసుకుంటూ పాడుతుంటాయి. దేవుడామని లేచి దేశాలంట పోయి అట్నుండి పిలుపు ఇట్నుండి కబురు లేక నీమాన్నువ్వు నా మాన్నేను ఎన్నాళ్లో బతికేసి చెల్లిపోయిన క్షణాలు చెప్పడానికి వెనక్కి కాళ్ళీడ్చుకు వచ్చినప్పుడు, అప్పుడు నీలోంచి గాలి పాడే చీరండల పాటలాంటిదే కనకప్రసాద్ గారి కవిత్వం. ఆయన కవితలు, అనువాదానికి“నేను ముందే చెప్పలేదూ?”ని చదవడం కొనసాగించండి
అంత నిజాన్నీ ఇవ్వకు
నేనడిగే ప్రశ్నలన్నిటినీ వినకు. అనుమానాల వంకతో బుకాయించే వీల్లేకుండా చేసే సమాధానాలు నీకు తెలిసినా చెప్పకు. ’నేనంటే నీకు అయిష్టం కదా? లోకంతో మననిలా కట్టిపడిసేది ఇంకా మిగిలున్న మన పాత్రల నటన మాత్రమే కదా?’ అని మాట తూలిన ఆ ఉన్మాద సమయాల్లో; ఇన్ని యుగాల బట్టీ ఎవరెవరో ఎవరెవర్నో అడక్కుండానే వదిలేసి వెళ్ళిపోయిన ప్రశ్నలన్నిట్నీ, ఒకవేళ అడిగానే అనుకో! విననట్టు ఉండిపో, ’అవున’ని నీకు ఎంత నిక్కచ్చిగా తెలిసినా సరే చెప్పావంటే నామీద ఒట్టే!“అంత నిజాన్నీ ఇవ్వకు”ని చదవడం కొనసాగించండి
అగరుపొగల వెచ్చలి
గుండెపొదిలోని శీతాంశుశరాలని చూసి జ్ఞాపకాల పక్షులు బెదురుతూ వచ్చి ఓ వరసలో కూర్చున్నప్పుడు- చీలిన చంద్రబింబాల్లాంటి తన అక్షరాల అరచేతుల్లోని మబ్బు పింజలతో వాటికి నుదురు తుడుస్తాడు కవి. అన్నిటికన్నా భాషే ఎక్కువగా బాధించిందని అశ్రురహిత దుఃఖంతో లోలోకాలుగా ఊగిపోతుంటాడు. “నీతో ప్రత్యేకంగా మాట్లాడటం నీకే కాదు నాకు కూడా శిక్షే, ఐనా నాలో ఎవరు ఆమెకు దాసోహమయ్యారో తేల్చుకోవాలి, గులాబియానంలో వెళ్ళిపోతున్న హేమంతానికి పుప్పొడి దప్పిక తీర్చిమరీ పంపాలి” అంటూ కొలనుకీ, ఏరుకీ నచ్చజెప్పి, జలజలా“అగరుపొగల వెచ్చలి”ని చదవడం కొనసాగించండి
కలలు కావాలి జీవితం దున్నడానికి…!
“కళ్ళు తుడుస్తాయి కమలాలు వికసిస్తాయి మెదిలితే చాలు నీ నామాక్షరాలు పెదవులమీద భ్రమరాల్లా”- కవిత్వాన్ని ఒక ఉత్సవంగా పాడుకునే గజల్ సంస్కృతిని అమితంగా ఆరాధించే గుంటూరు శేషేంద్ర శర్మ గారి వాక్యాల్లో ఆ సౌకుమార్యం, అత్తరు సౌరభాల సంగీతం గుభాళిస్తూ ఉంటాయి. వసంతం వాసనేస్తే ఉండబట్టలేని నవకోకిలలా జీవన తరుశాఖల్లో తియ్యని రాగాల్ని ఒలకడమే ఈయన కవిత్వ లక్షణంగా కనపడుతుంది. పువ్వునీ శిల్పాన్నీ దారంతో కలిపి ఇల్లు అల్లుకునే సాలెపురుగు లోని ప్రజ్ఞ ఈయన కవితా వైవిధ్యంలో“కలలు కావాలి జీవితం దున్నడానికి…!”ని చదవడం కొనసాగించండి
“మో” రికామీ చరణాల మననం…
“అట్లా అని పెద్ద బాధా ఉండదు” అవే అవే పాదాల్ని పదే పదే బెంగగా కలగలిపి పాడుకునే మెలాంకలీ లోని నిరీహ తప్ప ఎక్కువగా చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. బహుశా అది “కేవలం దుఃఖానుభూతినైనా పొందలేని డెస్పరేటశక్తత“ కూడా కావచ్చు. మండే వెల్తురు తప్ప కప్పుకోని పూలనీ, అనాచ్ఛాదిత స్వేచ్ఛతో అహరహం చిగుర్లెత్తే సమస్త ప్రకృతిలోని జీవాన్నీ తనలో నింపుకోలేక ఆర్తిచెందిన కవి విషాదం కావచ్చు. “విషాదంలోంచి దుఃఖంలోకి/దుఃఖం లోంచి శోకంలోకి” ఆరోహించే లక్ష సారంగీల వేదనారాగాలు““మో” రికామీ చరణాల మననం…”ని చదవడం కొనసాగించండి