భావుకత్వపు పందిరి కింద ప్రేమ, ప్రకృతి, జ్ఞాపకాలు, వియోగం అనే నాలుగు స్తంభాలాటలో తమ అనుభూతులను కవిత్వంతో దాగుడుమూతలాడించిడం చాలామంది కవుల్లాగే మానసకూ ఇష్టమైన ఆటలా అనిపిస్తుంది. ఈ కవితను ’చిలకలు వాలే చెట్టు’గా పిలుచుకొని పచ్చగా నవ్వుకోవడం లోనే ఆమె కవిత్వపు తాలూకూ ఒక ఆహ్లాదభరితమైన కువకువ మనకు వినిపిస్తుంది. మొదటి పంక్తుల్లో- జీవిత గమనంతో, కాలపు వేగంతో పాటు అనివార్యంగా పెట్టే పరుగు విసుగెత్తినప్పుడు, ఒక ఆశయమంటూ లేక అలసిపోవడం కోసమే పరుగులు పెట్టిన“మానస వెతుక్కున్న చిలకల చెట్టు!”ని చదవడం కొనసాగించండి
Category Archives: మాటల తోట
కొన్ని త్రిపుర సందర్భాల్లో
త్రిపురని చదవడమంటే హాయిగా, అందంగా, కులాసాగా ఈలపాట పాడుకుంటూ అద్దంలో చూసి తల దువ్వుకోవడం కాదు. సూటిగా అద్దాన్ని గుద్దుకుని బద్దలు కొట్టుకుని లోపలికెళ్తూ గాజుముక్కల్ని జేబుల్లో కుక్కుకోవడం. త్రిపురని చదవడమంటే కథల్లో శైలినో, వస్తువునో, సందేశాన్నో నేర్చుకోవడమో రచయితని తెలుసుకోవడమో కాదు, నీలోపలి టెక్నిక్‌నీ నీలోలోపలి కండిషనింగ్‌నీ కడిగి పారేసి నిన్ను నువ్వు చదవడం నేర్చుకోవడం, అసలు తెలుసుకోవడమంటే ఏమిటో తెలుసుకోవడం. అసలు త్రిపురని చదవడమంటే మళ్ళీ మళ్ళీ శక్తి కూడగట్టుకు తెంపరిగా చదవడం అంటే“కొన్ని త్రిపుర సందర్భాల్లో”ని చదవడం కొనసాగించండి
వాంగ్మూలం (కథ)
వాంగ్మూలం గుండె పగిలిపోతోందిరా చిన్నోడా.. యాభయ్యేళ్ల ఒంటరోడిని, తాగుబోతు నా కొడుకుని, అర్ధరాత్తుళ్ళు ఫోన్ చేసి “లవ్ యూ రా బంగారుకొండా” అంటే సంస్కారపుజబ్బు ముదిరినోడివి కాబట్టి నా మత్తు సంగతి కనిపెట్టి నీ నిద్రమత్తుని దాచిపెట్టి “ఇవ్వాళ కూడా డోసెక్కువైందా?” అని విసుక్కోకుండా అడిగినప్పుడు ఎంత ముచ్చటేసేదిరా! సఫరింగ్, సఫరింగ్, సఫ – రింగ్, టేబిల్ మీద ఖాళీగా గ్లాసుల అడుగుజాడల రింగులు. వలయాలు, వేదనా వలయాలు, శోధనా వలయాలు. కళ్ళు తిరిగి వళ్ళు“వాంగ్మూలం (కథ)”ని చదవడం కొనసాగించండి
ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం
తెలుగునాట ప్రాచీనమూ, ప్రశస్తమూ ఐన వీరగాథల్లో ఎన్నదగినవాటిల్లో కాటమరాజు కథాచక్రం ఒకటి. ముప్ఫై రెండు కథలుగా ప్రచారంలో ఉన్న ఈ సుధీర్ఘ వీరగాథా చక్రం తెలుగు వీరగాథావృత్తాల్లోకెల్లా పెద్దదిగా చెప్పుకోవచ్చు. వేటూరి, మల్లంపల్లి, తిమ్మావజ్ఝల గార్ల రచనలను ఆధారంగా చేసుకుని, తాను మరికొంత పరిశోధన చేసి ఆరుద్ర ఈ కథ ఆధారంగా ఒక నాటకాన్ని రచించారు. దీన్ని సశాస్త్రీయంగా మరికొంత సంస్కరించి పరిష్కరించాలని భావించినా, ’సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర’ రచన కారణంగా ఆ పని చెయ్యలేకపోయారు. సమగ్రాంధ్ర“ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం”ని చదవడం కొనసాగించండి
శ్రీ కృష్ణ శ్రీ తిలక్ శాస్త్రి!!
“వేళ కాని వేళ లలో, … దారి కాని దారులలో, ….” వెళ్లకూడదని తెలిసీ ఆ దారంట బయల్దేరాను. అనుకున్నట్టుగానే ఆ ఇంటిముందుకి రాగానే “ఆగక్కడ ఆగక్కడ అగాగు అక్కడనే” అనెవరో పిలవటం వినిపించింది. ఇంకెవరు, భయపడినట్టుగానే సౌమ్య. అసలు బ్రతకనేర్చిన వారెవరైనా సౌమ్య కి కనపడతారా? కనపడెను పో దారి మార్చి పారిపోక అక్కడే ఉంటారా? ఎందుకంటారేమిటి మనిషి కనపడగానే “రివ్యూ రాశారా?” అంటుంది. అసలు ఏదేనా రాయలంటే ముందు మరేదైనా చదవాలి కదా! ఆ“శ్రీ కృష్ణ శ్రీ తిలక్ శాస్త్రి!!”ని చదవడం కొనసాగించండి
మరి కొన్ని చోట్ల
చదువది యెంత గల్గిన ఆంద్ర జ్యోతి ..నవ్య లో ఈనాడు.. ఈతరం లో ఉగాది సంపాదకీయం ఏటి ఒడ్డున కొన్ని మాటలు కంప్యూటర్ ఎరా లో ఊకదంపుడు బ్లాగు సమీక్ష
కె. విశ్వనాథ్
నా అభిమాన దర్శకులు విశ్వనాథ్ గారిపై beyondindia పత్రిక ఏప్రిల్ సంచిక లో నా వ్యాసం ప్రచురితమైంది. -కల్హార
జాతిని కాపాడుకుందాం
మీ అందరీ అభిప్రాయలు అమూల్యమైనవే. ఈ మధ్య కాలం లో ప్రేమ వివాహాల వల్ల, పెళ్ళికి ముందే ఏర్పడే అవగాహన వల్ల, ఇద్దరు సమాన బాధ్యత తీసుకోవటం జరుగుతుంది అమ్మాయి మీదే భారం పడకుండా(నా విషయం లో అలాగే జరిగింది).ఇది చాలా ఆశాజనకమైన పరిణామం. కానీ పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో ఎక్కువ శాతం ఎదో ఒక పేరు తో అమ్మాయి వైపు వారే ఎక్కువ భారాన్ని మోస్తున్నారు.. సాంప్రదాయం వల్ల కావొచ్చు, సమాజం లో పరువు కోసం“జాతిని కాపాడుకుందాం”ని చదవడం కొనసాగించండి
జాతిని కాపాడుకుందాం
అంబానాధ్ గారి ఈ వ్యాసం చదివి నా అభిప్రాయాన్ని ఇక్కడ రాస్తున్నాను. దీనీవల్ల ఎవరినైనా అనవసరం గా బాధ పెడితే క్షమించాలి. ఏం చేస్తాం ఇదంతా స్వయంకృతం. వేరే దేశాల కన్నా మన దేశం లో అమ్మాయిలంటే తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారో అలోచించారా? వాళ్ళ ఉద్దేశం లో అమ్మాయికి ఎక్కువ ఖర్చు అంటే అమ్మాయి ఎక్కువ తింటుందని కాదు అమ్మాయిలచదువుకి ఎక్కువ ఖర్చు అవుతుందని కాదు. అసలైన కారణం కట్నం (కట్నాలు, కానుకలు, లాంచనాలు ఇతరత్రా)..“జాతిని కాపాడుకుందాం”ని చదవడం కొనసాగించండి
అమృతం కురిసిన రాత్రి
“ఒక నిశార్ధ బాగంలో నక్షత్ర నివహగగనం ఓరగా భూమ్మీదకు ఒంగి ఎదో రహస్యం చెప్తున్న వేళ ఒంటరిగా నా గదిలో నేను మేల్కుని రాసుకుంటుంటాను” ముందే తెలిసి ఉంటే ఆ అమృతం కురిసిన రాత్రి నేనూ మేల్కుని ఉందును కదా అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివితే. ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వం గా కూడా అనిపించనూ వచ్చు. “గాజు కెరటాల వెన్నెల సముద్రాలు జాజి పువ్వుల అత్తరు దీపాలు” తిలక్ వూహా“అమృతం కురిసిన రాత్రి”ని చదవడం కొనసాగించండి