Category Archives: ‌పోస్ట్ బాక్స్

ఎన్ని అనుభూతుల ఉత్తరాలు వేసినా సాయంత్రానికి ఖాళీ అయ్యే పోస్ట్ బాక్స్ లాంటిది మనసు – యండమూరి

నదిలోని నీరు

పదార్ధంతో చైతన్యమూ పనితో బద్ధకమూ సంధి చేసుకున్న సాయంత్రపు వంతెన మీది చివరి వెలుతురు చుట్టూ రెక్కలు చాపుకుని వలయాలుగా తిరిగిన పావురమొకటి వేసటగా వాలిపోయాక ఏకాంతం సంగీతంగా మారే సుతిమెత్తని సవ్వడిని నింపుకోవడానికి సంచీలోని సంపదనంతా ఒలకబోసుకున్న వాడొకడు… సంధ్యా సముద్రమూ చెరోవైపు నుంచి మీదకొచ్చి పడుతుంటే, తిరిగెళ్లే ప్రతి అలతో పాటు ఇసుకలోకి … చదవడం కొనసాగించండి

Posted in ‌పోస్ట్ బాక్స్ | 1 వ్యాఖ్య

ఊపిరిపాటకు చూపేదీ?

శిల్పాల్నీ, శిధిలాల్నీ సాగరాన్నీ, నగరాన్నీ మేల్కొలుపుతూ వినబడ్డాడతను వేకువల్ని వణికించే వేణువుగా. గాలి మడుగులో రాగాల జాడలు పట్టుకుని వెదుక్కుంటూ వెళ్ళి చూశానతన్ని చూశానా? కాదు కరుణించి కనపడ్డాడు పాట ఆపినపుడు మురళితోబాటు మహాబలిపురాన్నే సంచిలో పెట్టుకున్నాడా అని? జలదరించిన ఉదయాలను సంగీతానికి వదిలి రాత్రుల్ని కళ్ళుగా చేసుకున్నాడా అని? అడగలేదు – ధ్యానానికి కొనసాగింపు … చదవడం కొనసాగించండి

Posted in ‌పోస్ట్ బాక్స్ | వ్యాఖ్యానించండి

భ్రష్టయోగి

తిరిగి దొరకడానిక్కాక వెతికించుకోవడానికే తప్పిపోయిన ఒక పద్యంకోసం రోజులతరబడీ, రాత్రులవెంబడీ ఆకలీ ఆహారమూ తనకు తనే అయి రాసుకున్నాడేవో కొన్ని సౌందర్యోన్మత్త గీతాల్ని… కిటికీ అంచులు ఏటవాలు నీడల్ని ఇంటిగోడలపైకి జారవిడుస్తూ ఏకాంతంలో బద్ధకంగా చల్లుకున్న దిగులు గింజల చుట్టూ బూడిదరంగు పావురాలు రెక్కలు ముడుస్తూ తెరుస్తూ మసలినప్పుడు పాదాక్రాంతమయ్యాడు ఆ మచ్చికైన హేమంతపు సాయంత్రాలకి… … చదవడం కొనసాగించండి

Posted in ‌పోస్ట్ బాక్స్ | వ్యాఖ్యానించండి

అరచేతిలో ఆకాశం

ఆకాశమంటే పొగకాదు, చెల్లాచెదురైన ధూళి మబ్బుల సమూహం కాదు. పదార్ధమూ, శూన్యమూ కాదు. కొన్ని అస్తిత్వాలు లేవని చెప్పడానికి ఎంత గట్టి ఋజువులుంటాయో ఉన్నాయని తెలుసుకోవడానికి అంతకంటే బలమైన నమ్మకం ఆసరాగా ఉంటుంది; దైవం లాగా, ఆకాశంలాగా. ఆ నమ్మకాల్లో ఉండే గొప్ప నిశ్చింత, నిబ్బరం, ఆనందం, ఆహ్లాదం- ఇవే వాటి రూపాలు, రూపాంతరాలు, అస్తిత్వాలూ. … చదవడం కొనసాగించండి

Posted in ‌పోస్ట్ బాక్స్ | 2 వ్యాఖ్యలు

తెల్లరంగు సీతాకోకచిలుకలు

అనుమానం; చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు కంటికి సమాంతరంగా సాగని చూపులు ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు —– నమస్కారం; తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు వంచనకి —– అవసరం; గాయపడని చోట ముందు చూపుతో కాస్త మందు ఆత్మను కాపాడుకోడానికి … చదవడం కొనసాగించండి

Posted in ‌పోస్ట్ బాక్స్ | 1 వ్యాఖ్య

ప్రాప్తం

మళ్ళీ ఉదయం వచ్చి వెలుతురు మరకల్ని అంటించేవరకూ ఈ రాత్రి స్వచ్ఛంగా మలుగుతుంది. పచ్చని ఆకు జీవితానికి – పట్టుమని ఒక్కగానొక్క వసంతం వరంగా దొరుకుతుంది. చంచల చిత్తానికి- పంచేంద్రియాలతో పంచుకోలేని ధ్యాన భిక్ష క్షణమాత్రపు సౌఖ్యాన్నిస్తుంది మృత్యువు పాదాలమీద పడ్డ అనుభవం జ్ఞానం వైపు చూసి ఏదో సంకేతాన్నిస్తుంది. (మొదటి సారిగా ఈమాటలో)

Posted in ‌పోస్ట్ బాక్స్ | 5 వ్యాఖ్యలు

నిర్వేదన

తనువుని తెంపిన తొలకరి మొలక తరువుగా మారాలని తడిమట్టి తపస్సు విరబూసిన పరిమళాల్ని చిరుగాలిపై రువ్వుతూ మూలాల్ని దాచిన మొక్క మిడిసిపాటు తానెన్నటికీ చూడలేని వసంతాలను వర్షిస్తూ లోతుగా ఎదుగుతున్న వేరు వినమ్రత —————- మొదటి ప్రచురణ పొద్దులో

Posted in ‌పోస్ట్ బాక్స్ | 8 వ్యాఖ్యలు